Menu Close

“ఉబుంటూ” ఆఫ్రికా దేశపు సంప్రదాయం – Telugu Moral Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Moral Stories

ఒక మానవ శాస్త్రవేత్త (ఆంత్రోపాలజిస్ట్) ఆఫ్రికా జాతి యొక్క అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాల గురించి పరిశోధన చేస్తున్న సమయంలో అతన్ని ఆ ఆఫ్రికా జాతి పిల్లలు చుట్టుముట్టేవారు. ఒక రోజు వాళ్లతో ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాడు. చాక్లెట్లు తెప్పించి అన్నీ ఒక అందమైన పెట్టెలో అమర్చి ఒక చెట్టు మొదట్లో పెట్టాడు.

ఆ ఆఫ్రికా పిల్లలను పిలిచి ” నేను ‘రెడీ’ అనగానే అందరూ ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తాలి. ఎవరు ముందు పెట్టెను తీసుకుంటే అందులో ఉన్న చాక్లెట్లు
అన్నీ వాళ్ళవే.” అని చెప్పాడు. పిల్లలందరూ వరుసగా నిలబడి ఆంత్రోపాలజిస్ట్ ‘రెడీ’ అనగానే ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఆ చాక్లెట్లపెట్టె దగ్గరికి పరిగెత్తారు.

అందరూ కలిసి చాక్లెట్లను తీసుకొని పంచుకొని ఆనందంగా తింటూ కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి “ఇలా అందరూ కలిసి చాక్లెట్లు ఎందుకు పంచుకున్నారు” అని అడిగాడు. పిల్లలు ఇలా జవాబు ఇచ్చారు, “ఉబుంటూ – మిగిలినవాళ్లు బాధపడుతుంటే ఎవరో ఒకరం ఎలా ఆనందంగా ఉండగలం. అందుకే అందరం కలిసి పంచుకున్నాం.

“ఉబుంటూ” ఆఫ్రికా దేశపు సంప్రదాయం. దాని అర్థం మానవత్వం యొక్క మాధుర్యం. ఉబుంటూ చెప్పేదేమిటంటే ఒంటరిగా నీవొక్కడివే మనిషిగా
బతకలేవు. ఉబుంటూ అంటే ఔదార్యం . మనం మంచి చేస్తే అది విశ్వవ్యాప్తం అవుతుంది. మానవజాతినంతటినీ ఒకటిగా నడిపిస్తుంది.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading