ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఒక పెద్ద వ్యాపారవేత్త సముద్రపు ఒడ్డున కూర్చుని, ఒక పడవ తనవైపు రావడం చూసాడు. అందులో ఒక జాలరి కొన్ని చేపలు పట్టి తెస్తున్నాడు. వ్యాపారవేత్త, “ఇన్ని చేపలు పట్టడానికి నీకెంత సమయం పడుతుంది ?? ఇంకొంచెం ఎక్కువ సేపు ఉండి ఇంకా ఎక్కువ చేపలు పట్టవచ్చు కదా !” వ్యాపారవేత్త అడిగాడు.
“నా కుటుంబ పోషణకు ఇవి చాలు.” అన్నాడు జాలరి. అయితే రోజంతా ఏం చేస్తావ్??” కుతూహలం పట్టలేక అడిగాడు “ఉదయమే సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి, ఇంటికి పోయి పిల్లలతో ఆడుకుంటాను, మధ్యాహ్నం నా భార్యతో భోజనం చేసి, కొద్దిసేపు నిద్రపోతాను. సాయంత్రం మిత్రులతో ఆటపాటలతో గడుపుతాను.” అన్నాడు జాలరి.
వ్యాపారవేత్త జాలరితో, “నేను మానేజ్ మెంట్ లో PhD చేసాను. నీవు ఇంకా గొప్ప జీవితం గడపే సలహా చెప్తా. ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ సేపు సముద్రంలో ఉండి ఎక్కువ చేపలు పట్టు, డబ్బు సంపాదించు, కూడబెట్టు, దీనికంటే పెద్ద పడవ కొనుక్కో, ఇంకా చాలా చేపలు పట్టు, అమ్ము, సంపాదించు, ఇంకొన్ని పెద్ద పడవలు కొనుక్కో, నీ స్వంత చేపల కంపెనీ పెట్టు, చేపలతో తయారైన పదార్థాలు అమ్ము.
పెద్ద పట్టణానికి మారు !” “ఆ తరవాత!!” జాలరి ఉత్సుకతతో అడిగాడు. బిజినెస్ మ్యాన్ పెద్దగా నవ్వి, “రాజాలా బ్రతకొచ్చు, స్టాక్ ఎక్స్ చేంజిలో షేర్లు పెట్టి, గొప్ప ధనవంతుడివి కావచ్చు.” “ఆ తరవాత” జాలరి మళ్ళీ అడిగాడు. నీవు రిటైర్ అయిపోయి, పెద్ద ఇంటికి మారి, ఉదయాన్నే చేపలు పట్టి, ఇంటికి పోయి, భార్యాపిల్లలతో హాయిగా గడిపి, సాయంత్రం స్నేహితులతో ఆడిపాడవచ్చు.”
జాలరి ఆశ్చర్యంగా, “ఇప్పుడు నేను చేస్తున్నదదే కదా!!!!”
సేకరణ – V V S Prasad