ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ముగ్గురు స్నేహితులు డబ్బు సంపాదించాలనే దుగ్ధతో అన్నీ సమకూర్చుకొని ఒక పెద్ద పట్టణానికి బయల్దేరారు. రెండు రోజులు నడిచి ఒక అడవి ప్రాంతానికి చేరుకున్నారు. అనుకోకుండా అక్కడ వాళ్ళకు ఒక బంగారు నాణేల సంచి దొరికింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన స్నేహితులు ఆ నాణాలు సరిసమానంగా పంచుకోవాలని అనుకున్నారు.
స్నేహితులు ముగ్గురు నడిచి, నడిచి అలిసిపోయారు. ఆకలితో నకనకలాడుతున్నారు. ముగ్గురిలో ఒకరు దగ్గరి పల్లెటూరికి పోయి తినడానికి ఏమైనా తేవాలని, మిగిలిన ఇద్దరూ బంగారు నాణేలు సంచికి కాపలాగా ఉండాలని నిశ్చయించుకున్నారు.
ఆహారం కోసం పోయిన స్నేహితుడికి, “మిగిలిన ఇద్దరు స్నేహితులకు విషం కలిపిన ఆహారం పెట్టి చంపేస్తే మొత్తం నాణాలన్నీ స్వంతం అవుతాయ”నే దుర్బుద్ధి పుట్టి విషం కలిపి ఆహారాన్ని తీసుకొచ్చాడు.
ఇక్కడ బంగారు నాణేలకు కాపలా ఉన్న స్నేహితులకు, ఆహారం తెస్తున్న స్నేహితుడిని చంపేసి, ఇద్దరూ నాణాలు సరిసమానంగా పంచుకోవాలని దురాశ కలిగింది. స్నేహితుడు ఆహారం తీసుకు రాగానే అతని మీదకి లంఘించి చంపేసారు.
ఆనందంగా ఇద్దరూ బంగారు నాణేలు సగం సగం పంచుకోవచ్చని, స్నేహితుడు తెచ్చిన విషాహారం తిని కొద్ది నిమిషాలలో చచ్చిపడి పోయారు. అత్యాశతో ఒకరి మీద ఒకరు కుట్రలు పన్నుకొని హతమయ్యా రు.
హు…. బంగారు నాణేల సంచి శవాల మధ్య పడి ఉంది. “అత్యాశ అనర్ధాలకు దారితీస్తుంది.”
సేకరణ – V V S Prasad