Menu Close

ముళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ జీవితాలు గడుపుతాం – Telugu Moral Stories

Telugu Moral Stories

మా పక్కింటి కుక్క ఒకటే ఏడుస్తోంది. కొంతసేపు ఏడ్చి ఆపేస్తుందిలే అనుకుంటే, అది రోజంతా కుయ్యో మొర్రో అని ఏడుస్తోంది. దాని ఏడుపు భరించలేక ఆ ఇంటి పెద్దమనిషిని అడిగాను, “ఆ కుక్క అలా ఏడుస్తుంటే, దాని బాధ తెలుసుకొని నివారించరా!” ” సమస్య ఏమిటంటే, ఆ చెక్కబల్ల మీదే అది కూర్చుంటుంది. అయితే ఆ చెక్కబల్లలో ఓ మేకు బయటికి వచ్చి మొనదేలి ఉంది.

ఆమేకు గుచ్చుకుంటూ ఉంటే దాని బాధ భరిస్తూ ఏడుస్తోంది.” “ఆ కుక్క అక్కడ నుండి ఎందుకు లేవదు.” ” ఆ కుక్కకు ఆ చెక్కబల్ల మీద ఎన్నో రోజుల నుండి కూర్చునే అలవాటు. అయితే ఇప్పుడు ఆ మొనదేలి ఉన్న మేకు బయటికి వచ్చింది. దాని మీదే కూర్చుని ఆ బాధ అనుభవిస్తూ ఉంది, కానీ లేవడం లేదు. ఇంకొంచెం బాధ ఎక్కువైతే లేస్తుందేమో!!” అన్నాడాయింటి పెద్ద మనిషి.

మనం కూడా చాలా రకాల ముళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ జీవితాలు గడుపుతాం. మనం చేసే ఉద్యోగం ఇష్టం లేదు, బాస్ అంటే ఇష్టం లేదు. ఆ వాతావరణం బాగా లేదు, వాళ్ళిచ్చే జీతం తృప్తిగా లేదు. అయినా ఏడుస్తూ గడుపుతాం. బాంధవ్యాల ముళ్ళ మీద కూర్చుని బాధపడేవాళ్ళు కొందరు. ప్రేమ, అభిమానం, గౌరవం లేని బాంధవ్యాలను విధిలేక మూగగా ఏడుస్తూ కొనసాగిస్తున్నారు. అంతేకాక ఆరోగ్యం, కుటుంబం, స్నేహం, దురలవాట్ల వంటి అనేక ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి. అయినా వాటిని ఒదలం. అయినా వాటిని వదిలించుకోవడానికి ఏమీ చెయ్యం. కారణం అవి అంతగా బాధించడం లేదని అపోహ. అవి భరించలేనివిగా మారినప్పుడు చూద్దాంలే అనుకుంటాం. గుచ్చుకుంటున్న ముళ్ళను తొలగించుకోక పోతే భరించలేని స్థితికి చేరుకుంటారు.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు,

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images