ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
సముద్రంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక దీవికి కొన్నాళ్ళ క్రితం ఒక రాబందుల గుంపు వచ్చింది. అక్కడ చేపల వంటి ఆహారం పుష్కలంగా దొరుకుతోంది. అంతేకాక కౄరమైన అడవి జంతువులు కూడా లేవు. రాబందులు ఇంతకు ముందెన్నడూ అనుభవించని సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి.
ఆ గుంపులోని యువ రాబందులు అక్కడే శాశ్వితంగా ఉండాలని అనుకున్నాయి ఒక వృద్ధ రాబందు యువత ఆలోచనలు విని వ్యాకులత చెంది, యువ రాబందులకు సలహా ఇచ్చింది, “చాలా రోజుల నుంచి ఈ దివిలో ఉన్నాం. ఇప్పుడు మనం మన అడవుల్లోకి వెళ్లి పోవాలి, సమస్యల్లేని సుఖమైన జీవితాన్ని గడుపుతున్నాం. సమస్యలను ఎదుర్కొనే శక్తిని కోల్పోతున్నాం.” రాబందులు వెక్కిరిస్తూ, ఆ దివి విడిచి పోవడానికి ఒప్పుకోలేదు.
వృద్ధ రాబందు, “మీరు సుఖమైన స్థితికి అలవాటు పడిపోయారు. కష్టం వస్తే తప్పించుకోలేరు. మూర్ఖత్వం మాని వచ్చేయండి.” రాబందులు అన్నీ ముసలి రాబందు మాటలు పెడ చెవిన పెట్టాయి. చేసేదేమీలేక ఒక్కతే వెళ్లి పోయింది. కొన్ని నెలలు తర్వాత ముసలి రాబందు, ఈ దీవిలో రాబందులు ఎలా ఉన్నాయో చూడడానికి దివికి వచ్చింది. గాయపడ్డ రాబందులు, చచ్చిన కళేబరాలు కనిపించాయి. “అసలేం జరిగింది?? “
మీరెళ్ళిన తరవాత కొంత కాలం అంతా బాగానే ఉంది. ఒక రోజు ఒక పడవ దివిలో చిరుత పులులను వదిలి పోయింది. మొదట్లో అవి మమ్మల్నేం చెయ్యలేదు
మేం ఎగరలేమని, ద్దుబారిన గోళ్లతో అశక్తులం అని తెలిసి, దాడి చేసి, మమ్మల్ని చీల్చి చెండాడేసాయి. కొన్నిటిని చంపి తినేసాయి.” వాపోయింది.
సుఖమైన జీవితానికి అలవాటు పడితే, బయటకు రాలేం. సవాళ్లను, సమస్యలను, కఠిన పరిస్థితులను ఎదుర్కోలేం.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Telugu Moral Stories