ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఒక మహిళ తన కుటుంబంతో ఒక పెద్ద హోటల్లో బస చేసింది. ఆమెకు ఆరు నెలల పాప. ఆ హోటల్ మేనేజర్ ని, “పాపకు ఒక కప్పు పాలు కావాలి దొరుకుతాయా” అని అడిగింది. మేనేజర్ “దొరుకుతాయి.. వంద రూపాయలు” ఆ హోటల్ నుంచి ఇంటికెళ్ళేప్పుడు ఆ పాపకు మళ్ళీ ఆకలి వేసింది. దారిలో రోడ్డు పక్కన ఉన్న ఒక టీ స్టాల్లో పాపకు కప్పు పాలు తీసుకుని, ‘ఎంత’ అని అడిగింది. “చిన్నపిల్లల పాలకు డబ్బులు ఒద్దమ్మా!” అన్నాడు.
“దారిలో పాపకు ఇంకా కావాలంటే తీసుకెళ్ళండి” ఆ మహిళ ఆలోచించింది. “ఎవరు ధనవంతులు? హోటల్ ఓనరా! టీస్టాల్ ఓనరా !!” నిజంగా పేదవాళ్ళు ఎవరూ??
ఇంకో ఉదాహరణ చూద్దాం ! ఓ ధనవంతురాలు బట్టల షాప్ కు వెళ్లి, “కొంచెం ధర తక్కువ బట్టలు చూపించండి, మా అబ్బాయి పెళ్లి, మా పనిమనిషి కొడుక్కి పెట్టాలి” అడిగింది. కొంత సేపటికి పనిమనిషి బట్టల షాప్ కు వచ్చి, “మా యజమానురాలి కొడుకు పెళ్లి, ఒక మంచి సూట్ చూపండి. కొంచెం ధరెక్కువైనా ఫర్వాలేదు”
పేదరికం మనసులో ఉందా!! పర్స్ లో ఉందా !!
కొన్ని సార్లు సంపాదనలో పడి మనం మనుషులం అని మరిచిపోతాం . అవసరమైన వాళ్ళకు ప్రతిఫలాపేక్ష లేకుండా చిన్న సహాయం చేద్దాం. అది డబ్బు సంపాదించడం కన్నా ఆనందాన్నిస్తుంది. స్వతహాగా మనం మంచివాళ్ళమే, మంచివాళ్ళ స్నేహం మరింత మంచివాళ్ళను చేస్తుంది. ప్రపంచం అంతా మంచివాళ్ళతో నిండి ఉంది… మీకెవ్వరూ కనిపించక పోతే…. మీరే మంచివాళ్ళుగా మారండి.
సేకరణ – V V S Prasad
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు