Menu Close

మంచి చెయ్యడం మానకండి – Telugu Short Stories

మంచి చెయ్యడం మానకండి – Telugu Short Stories

ఒక గృహిణి రోజు చపాతీలు చేస్తూ, ఒకటి ఎక్కువ చేసి, ఆకలితో ఉన్నవాళ్ళ కోసం కిటికీలో పెట్టేది. ప్రతిరోజు ఒక గూనివాడు ఆ చపాతీని తీసుకెళ్లేవాడు. కృతజ్ఞత చూపకుండా, “మీరు చేసిన పాపం మిమ్మల్నే దహిస్తుంది, మంచి మీకు మంచిని చేస్తుంది.” అనేవాడు. ప్రతిరోజూ ఆ గూనివాడు చపాతి తీసుకెళ్తూ, ఈ మాటలు అనడం పరిపాటై పోయింది.

గూనివాడంటే ఆవిడకి చిరాగ్గా ఉండేది. వాడిని భరించలేక, వదిలించుకోవాలని, వాడికోసం చేసిన చపాతీలో విషం కలిపింది. కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ఆ చపాతీని పొయ్యిలో వేసేసింది. మంచి చపాతీ చేసి కిటికీ లో పెట్టింది. వాడు ఆ చపాతీ తీసుకొని “మీరు చేసే పాపం మీకే నష్టం, మంచి మీకు మంచి చేస్తుంది.”

ప్రతి రోజూ కిటికీలో ఆ చపాతి పెట్టి, చాలా రోజుల క్రితం ఉద్యోగార్థం వెళ్లిన తన కొడుకు కోసం ప్రార్థించేది. ఆ సాయంత్రం ఎవరో తలుపు తట్టారు. తీసింది. ఎదురుగా ఆశ్చర్యంగా కొడుకు! సన్నగా, పీలగా, చినిగిన బట్టలు, తిండిలేక కళ్ళల్లో ప్రాణాలతో! తల్లిని చూడగానే, “అమ్మా, ఇది ఒక అద్భుతం. నేను మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు..

ఒక గూనివాడు కనిపిస్తే “తినడానికి ఏమైనా….” అడిగాను, అతను ఒక చపాతీ ఇచ్చి “నేను దీన్నే రోజూ తింటాను, ఈ రోజు నువ్వు తిను” ఆ తల్లి ఈ మాట
విని దిగ్భ్రాంతికి లోనైంది. ఆ రోజు విషం కలిసిన చపాతి గూనివాడికిచ్చి ఉంటే కొడుకు చచ్చి పోయేవాడేమో !! అప్పుడు ఆ గూనివాడి మాటలు అర్థమయ్యాయి. “నీవు చేసే పాపం నిన్నే దహిస్తుంది, చేసిన మంచి నీ వెంట వస్తుంది.” మంచే చెయ్యండి, మంచి చెయ్యడం మానకండి, ఎవరు మెచ్చుకున్నా, మెచ్చుకోక పోయినా !

సేకరణ – V V S Prasad

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks