ఒక వేటగాడు ఒక పావురాన్ని తీసుకువచ్చి దానికి రోజు ధాన్యపు గింజలు వేసుకుంటూ దానికి శిక్షణ నిస్తున్నాడు.. ఆపావురానికి తిండి నీళ్ల కోసం అడవులు తిరగకుండా తను ఉన్న దగ్గరికె ధాన్యపు గింజలు నీరు వచ్చేసరికి ఆ వేటగాడు ఎలా చెపితే అలా వినడం మొదలు పెట్టింది..
ఆ పావురాన్ని తీసుకొని ఆ వేటగాడు అడవికి వెళ్లి ఒక పెద్ద వల వేసి అందులో ధాన్యపు గింజలు వేసి ఆ పావురాన్ని అందులో వొదిలాడు.. అటునుండి ఆహారానికి వెళుతున్న పావురాల గుంపు ఆ పావురాన్ని చూసి మన జాతి పక్షి అక్కడ ఏదో ఆహారపు గింజలు తింటుంది
అక్కడ ఎలాంటి ప్రమాదం లేనట్లుంది అని నమ్మి మనం కూడా అక్కడకు వెళితే ఆహారం దొరుకుతుందని పావురాలన్ని ఆ వేటగాడు వొదిలిన పావురం దగ్గరికి వచ్చాయి చూసే సరికి అక్కడ విరివిగా ధాన్యపు గింజలు ఉన్నాయి తన జాతి పక్షితో అవికూడా తినడం మొదలు పెట్టాయి
ఆ వేటగాని వలలో చిక్కుకున్నాయి.. అందులో నుండి తను పెంచుకున్న పావురాన్ని బయటకు తీసి మిగితా పావురాలన్నింటిని పావురాలు తినే వారికి అమ్ముకునేవాడు
ఇలా ఆ వేటగానికి బానిసైన ఆ పావురం తను బ్రతకడం కోసం సుఖానికి అలవాటు పడి పలు మార్లు తనజాతి పక్షులను పట్టించడం తన జాతి కే ద్రోహం చేయడం మొదలు పెట్టింది..
నీతి: ఏ జాతిలోనైతే జాతి ద్రోహులుంటారో ఆ జాతి ఎన్నటికీ బాగుపడదు పైగా ఆ జాతి అంతరించిపోతుంది…!
From.Ade.Vishwanath.PD. Narnoor
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.