Menu Close

ప్రతి జాతిలోను ద్రోహులుంటారు – Telugu Moral Stories


ప్రతి జాతిలోను ద్రోహులుంటారు – Telugu Moral Stories

ప్రతి జాతిలోను ద్రోహులుంటారు
వారు తెలిసో, తెలియకో
వారి జాతికే ద్రోహం తలపెడతారు.

అంత తక్కువ సైన్యం వున్న బ్రిటిష్ వారు
ఇంత పెద్ద బారతదేశాన్ని
ఎలా కంట్రోల్ చెయ్యగలిగారు..?
ఎందుకంటే..
మన దేశం వారే స్వలాభాల కోసం
బ్రిటిష్ వారికి కొమ్ము కాసారు.

telugu bucket stories british

అలాంటి వృత్తాంతాన్ని తెలియచేసే అద్బుతమైన కథ, తప్పకుండా చదవండి. లైక్ చేసి షేర్ చెయ్యండి.

ఒక వేటగాడు ఒక పావురాన్ని తీసుకువచ్చి దానికి రోజు ధాన్యపు గింజలు వేసుకుంటూ దానికి శిక్షణ నిస్తున్నాడు.. ఆపావురానికి తిండి నీళ్ల కోసం అడవులు తిరగకుండా తను ఉన్న దగ్గరికె ధాన్యపు గింజలు నీరు వచ్చేసరికి ఆ వేటగాడు ఎలా చెపితే అలా వినడం మొదలు పెట్టింది..

ఆ పావురాన్ని తీసుకొని ఆ వేటగాడు అడవికి వెళ్లి ఒక పెద్ద వల వేసి అందులో ధాన్యపు గింజలు వేసి ఆ పావురాన్ని అందులో వొదిలాడు.. అటునుండి ఆహారానికి వెళుతున్న పావురాల గుంపు ఆ పావురాన్ని చూసి మన జాతి పక్షి అక్కడ ఏదో ఆహారపు గింజలు తింటుంది

అక్కడ ఎలాంటి ప్రమాదం లేనట్లుంది అని నమ్మి మనం కూడా అక్కడకు వెళితే ఆహారం దొరుకుతుందని పావురాలన్ని ఆ వేటగాడు వొదిలిన పావురం దగ్గరికి వచ్చాయి చూసే సరికి అక్కడ విరివిగా ధాన్యపు గింజలు ఉన్నాయి తన జాతి పక్షితో అవికూడా తినడం మొదలు పెట్టాయి

ఆ వేటగాని వలలో చిక్కుకున్నాయి.. అందులో నుండి తను పెంచుకున్న పావురాన్ని బయటకు తీసి మిగితా పావురాలన్నింటిని పావురాలు తినే వారికి అమ్ముకునేవాడు

ఇలా ఆ వేటగానికి బానిసైన ఆ పావురం తను బ్రతకడం కోసం సుఖానికి అలవాటు పడి పలు మార్లు తనజాతి పక్షులను పట్టించడం తన జాతి కే ద్రోహం చేయడం మొదలు పెట్టింది..

కళ్ళు తెరిపించే కథ – మీడియా, సోషల్ మీడియా – Reality Stories in Telugu
అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఓడించిన మహారాజు గురించి కనీసం విన్నారా – A Story of Alexander the Great
అశోక చక్రవర్తి గురించి మీకు ఎంత తెలుసు – Unknown Facts about Ashoka Chakravarthy

From.Ade.Vishwanath.PD. Narnoor

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Share with your friends & family
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading