అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ఇచ్చిన మాట కోసం ఎన్నో బాధలనుభవించారు – Telugu Moral Stories
ఒక రోజు గంగయ్య కాయలు కోయను మామిడి తోపులోకి పోతూ, భుజాన గడ చంకలో గోతాము పెట్టుకున్నాడు. కొంత దూరం పోయేసరికి,చంకలో సంచి పడిపోయింది కానడు. ఆడుకుంటున్న రవి అదిచూచి తీసుకుని పరుగెత్తుకుంటూ పోయి గంగయ్యకిచ్చాడు “సెహబాష్ రా అల్లుడు. సాయంత్రం తోటలోకిరా మంచి పండు ఇస్తాను.
గంగయ్య కాయలన్నీ కోసుకుని మూటగట్టి ఎత్తే మనిషి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో రవి వచ్చి మావయ్యా! “పండు” అని అడిగాడు. “అరె! శుభమా అని మూట కట్టేశాను కదరా! ఇంక విప్పకూడదు. వచ్చే కాపులో ఇస్తాలేరా ఏమి అనుకోకు” అన్నాడు.

రవి చెట్టు చెంతకు పోయి నాలుగు వైపులా పరిశీలించి” నీకు చెత్వారంగాని వచ్చిందా ఏమి మామా. కొసాకొమ్మన తాటికాయంత మామిడి పండును వదిలేశావు.” నిజమా!అని చెట్టెక్కి నాలుగు మూలల వెదక సాగాడు గంగయ్య.
ఒకమూలన దాగి తమాషా అంతా చూస్తున్నాడు రవి. చీకటి పడేవరకు వెదకి విసుగు చెంది దిగడంలో కాలుజారి క్రింద పడ్డాడు కొమ్మలు వళ్ళంతా గీసుకుని రక్తసిక్తమైనది. ఎలాగో తంటాలు పడి మూట ఎత్తుకుని ఇల్లు చేరుకున్నాడు.
“ఏమిటి ఈ అవతారం?” అన్నది భార్య. అంతలోకే రవి వచ్చి”అత్తమ్మా! పండు ఇస్తానని ఆశపెట్టి చివరకు ఇవ్వనే లేదు”అని జరిగినదంతా పూస గ్రుచ్చినట్టు చెప్పాడు. భార్యకు వళ్ళు మండిపోయింది.
“పాపం పసిబిడ్డ ఒక్క పండు నోరుతెరచి అడిగితే ఇవ్వలేక పోయావా? కోతులు ఎత్తుకు పోయినంత చేస్తుందా నీ పాపిష్టి బుద్దిగాకపోతే, మాట తప్పినందుకు దేవుడు తగిన శిక్షే విధించాడు. మాటకోసం మనపూర్వులు హరిశ్చంద్రుడు ,శిబిచక్రవర్తి, బలి చక్రవర్తి ఎన్నో బాధలనుభవించారు. అటువంటి పవిత్రమైన నేలపై పుట్టి పండు కాడ మాట తప్పుతావా?” అంటూ తలవాచేలా చివాట్లుపెట్టింది.
ఒరే!నీకు దండం పెడతాను నీకు కావలసినన్ని పళ్ళు ఎత్తుకుపోరా ఈమనిషితో వేగలేకున్బాను” నాలుగు పళ్ళు తీసుకుని ఎగురుకుంటూ ఇల్లు చేరాడు రవి.
జంజం కోదండ రామయ్య
భగవద్గీత చెప్పే జీవిత పాఠాలు – Life Lessons from Bhagavad Gita – Lord Krishna
మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది, లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి – Mahabharatham 18 Parvas
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com