అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Ghost Stories – Telugu Horror Stories – దెయ్యాల కథలు – హర్రర్ కథలు
సురేష్ : “ఒరేయ్ మట్టిబుర్ర ఎదవ?ఫోన్ చేస్తే తెలుస్తుంది కదారా ఆమె దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది, అప్పుడు నీకు మెసేజ్ చేసింది ఆ అమ్మాయే అని నీకు తెలుస్తుంది మరియు తను ఇంతవరకు చెప్పింది అబద్దం అని కూడా తెలుస్తుంది.”
రఘు : ఆ అమ్మాయి నెంబర్ కి కాల్ చేస్తాడు…
సురేష్ : అరేయ్ నీ నెంబర్ అంటే తెలిసిపోతుంది. నా నంబర్ నుండి చెయ్ రా
రఘు : ఓకే రా, అని సురేష్ మొబైల్ తీసుకుని ఆ అమ్మాయి నెంబర్ కి ఫోన్ చేస్తాడు రఘు.
సురేష్ : ఫోన్ రింగ్ అవుతుంది….. కానీ ఎవరి లిఫ్ట్ చేయడం లేదు.
షాపింగ్ మాల్ లో ఆ అమ్మాయి మరియు పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు. వాళ్ల దగ్గర ఎలాంటి ఫోన్ సౌండ్ రావడం లేదు.
బహుశా వాళ్ళు సైలెంట్లో పెట్టి ఉండవచ్చు అంటాడు రఘు.
అంతలో ఒక అమ్మాయి వాయిస్… ఫోన్ లో “హలో” అని వినబడుతుంది.
వెంటనే ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఎదురుగా ఉన్న అమ్మాయి షాపింగ్ చేస్తూ ఉంటుంది మరి ఫోన్లో మాట్లాడుతుంది ఎవరు? దయ్యమా? ఇద్దరికి భయం వేస్తుంది…
రఘు : హలో సౌజన్య రెడ్డి గారా…
అమ్మాయి : హా అవును.చెప్పండి.ఎవరు మీరు?
రఘు : నా పేరు రఘు.నిన్న చాటింగ్ చేశారు గుర్తుంది కదా…
అమ్మాయి : హా గుర్తుంది.కానీ నేను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను. మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి…
ఇద్దరూ కూడా షాపింగ్ మాల్ నుండి షాపింగ్ చేయకుండానే వెనక్కి వెళ్ళిపోతారు. ఇద్దరు వెళ్లి బార్ షాప్ లో ఫుల్లుగా బీరు తాగుతారు.
రఘు : “ఎం జరుగుతుంద్రా అసలు నా చుట్టూ..నాకు ఎం తెలిసి చావట్లేదు…”
సురేష్ : “అరేయ్ ,అవన్నీ పట్టించుకోకు, ఈరోజు నువ్వు చేసిన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది. బాస్ ఫుల్లు అప్రిషియేట్ చేసిండు. నువ్వు హ్యాపీ గా ఉండు అని అవే సర్దుకుంటాయి..”
రఘు : “ఏమోరా… నాకు ఆ మెసేజ్ రాకున్నా బాగుండేది.నాకు ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు ఉండేది కాదు.”
రఘు ఫోన్ లో మెసేజ్ వస్తుంది… అవతలివైపు ఆ అమ్మాయి “హాయ్” అని మెసేజ్ చేసింది.
సురేష్ : “ఎవరు రా మామ, నీకు మెసేజ్ చేసింది.”
రఘు :” ఇంకెవరూ ఆ దయ్యమే….”
సురేష్ రఘు పరిస్థితిని చూసి ” హా హా ..నవ్వుతాడు..”
రఘు : “ఎందుకురా నవ్వుతున్నావు.”
“సారి మామ..ఊరికే నవ్వా…నువ్వేం బాధ పడకు ..ఎలాగైనా ఆ దయ్యం మిస్టరీనీ మనం బయట పెట్టీ తీరుదాము.
రఘు : “అలాగే రా..తప్పకుండా రేపే అమావాస్య. ఈరోజుతో అక్కడ దయ్యం ఉందా లేదా నాకు తెలియాలి.ఇంకా నాకు msg చేసినా అమ్మాయి ,షాపింగ్ మాల్ కలిసిన అమ్మాయి ఒక్కరే కదా నాకు తెలియాలి.ఇవన్నీ తెలుసుకొని గేమ్ ని క్లోజ్ చేస్తాను…అంటూ” చాలా ధైర్యంగా మాట్లాడుతాడు రఘు
సురేష్ : “అవునురా.మన సిటీలో ఎన్నో రోజులుగా బీచ్ లో అందరికీ కనబడే దెయ్యం మిస్టరీ గనక మనం బయట పెట్టగలిగితే మనకు మంచి పేరు కూడా వస్తుంది.”
రఘు : “ఒకవేళ అక్కడ నిజంగా దయ్యమే ఉంటే…”
సురేష్ : “నాకు తెలిసిన ఒక సిద్ధాంతి ఉన్నారు..వారితో ఈ విషయం చెప్పాను. వారు కూడా మనతో పాటు వస్తా అని అన్నారు.”
రఘు : గుడ్ రా సురేష్… సరే చాలా లేట్ అయిపోతుంది. నేను నిన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేసి,నేను వెళ్తాను పద అని అంటాడు. సరే పద అంటూ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు.
మరుసటి రోజున ఉదయం…
రఘు ఉదయాన్నే ఆఫీస్ కి బయల్దేరాడు. వెంటనే అతనికి ఎదురుగా ఒక నల్ల పిల్లి అడ్డు వచ్చింది. వాళ్ళ అమ్మ అది అపశకునం అని చెప్పినగాని వినకుండా రఘు ఆగకుండా అర్జంట్ ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. అలా ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఒక కారు అతన్ని గుద్దడానికి వస్తుంది. వెంటనే ఒక అమ్మాయి అతన్ని వెనక్కి లాగి కాపాడుతుంది. హఠాత్తుగా కల చెదిరిపోయి మేల్కొంటాడు రఘు.
రఘును వాళ్ళ అమ్మ చూసి,
“ఏమైందిరా సడన్ గా లేచావు?”అంది రఘు వాళ్ళ అమ్మ
అదేం లేదు అమ్మ… ఎదో పీడకల వచ్చింది లే…
” అవునా ,అయితే ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకు ముందే నీకు ఈరోజు మంచి రోజు కాదు. అందులో ఈరోజు అమావాస్య రోజు. గత అమ్మవాస్య నాడు కూడా నువ్వు అర్ధరాత్రి ప్రయాణం చేసి చాలా ఇబ్బంది పడ్డావూ.”
“మేము నీ జాతకాన్ని తీసుకెళ్లి జ్యోతిష్యుని దగ్గరికి తీసుకెళితే,నీకు కన్య దోషం ఉందని చెప్పాడు.” “కాబట్టి నువ్వు ఏ అమ్మాయితో తిరక్కు. ఈ రోజు బయటకు వెళ్ళకు”
రఘు : “అమ్మ నీకు తెలుసు కదా..నీకు చెప్పకుండా ఎవరిని కూడా లవ్ చేయను అని నువ్వు మళ్లీ నా మీద అనుమానం పడతావు. ఈరోజు నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి ఆఫీస్కి..”
రఘు మాత్రం వాళ్ళ అమ్మ ఆఫీస్ కి సెలవు పెట్టమని చెప్పినా వినకుండా రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతాడు.వెంటనే తనకు ఒక నల్ల పిల్లి ఎదురు వస్తోంది.
రఘు వాళ్ళ అమ్మ చూసి, “ఒరేయ్ సన్నాసి!ఈరోజు నీకు మంచి రోజు కాదు అని చెప్పాను కదా! అందుకే ఈ అపశకునం వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా మూస్కొని ఇంట్లో ఉండు…”అని చెప్పింది అమ్మ
రఘులో కూడా ఏదో దిగులు మొదలవుతుంది. ఈరోజు అన్ని కలలో జరిగినట్టే జరుగుతున్నాయి. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి అని కాసేపు ఆగి కాస్త మంచి నీళ్ళు తాగి బయలుదేరుతాడు.
తను ఒక రోజు స్వప్న శాస్త్రం పుస్తకం చదువుతున్నప్పుడు ” వేకువ జాములో వచ్చే కలలు దాదాపు నిజం అవుతాయి ” అని అందులో రాసి ఉంది. ఆ పుస్తకం ప్రకారమే ఈ రోజు జరుగుతుందేమో అని తలుచుకుంటూ బైక్ రోడ్డు క్రాస్ చేస్తాడు. బైక్ పెట్టేసి తను నిల్చుంటాడు.
అతని మీదికి బ్రేకులు ఫెయిల్ అయిన ఒక బస్ అనేది వేగంగా వస్తుంది. వెంటనే అక్కడ ఉన్న ఒక అందమైన వైట్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అతన్ని వెనక్కి లాగి కాపాడుతుంది. ఆమె ఎవరో కాదు షాపింగ్ మాల్ లో రఘు చూసిన అమ్మాయి సుహాసిని.అదే అమ్మాయిని తను అర్ధరాత్రి రోజు కూడా చూశాడు. తనకు ఆ అమ్మాయి రూపం మరియు స్వరం బాగా గుర్తుంది.
సుహాసినికి థ్యాంక్స్ చెపుతాడు రఘు.
ఆ అమ్మాయి కూడా అతన్ని గుర్తుపట్టి పట్టనట్టుగా, ఇట్స్ ఓకే చెప్పి, తను స్కూటీపై వెళ్తుంది. రఘు ఆ అమ్మాయి వెళ్లే వైపే చూస్తూ ఉంటాడు.ఇలాంటి అందమైన అమ్మాయి నా జీవితంలో వస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తాడు రఘు.అప్పుడే ఆ అమ్మాయికి పడిపోతాడు.
రఘు ఆఫీస్కి వెళ్తాడు. వెంటనే రఘు సురేష్ ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. సుహాసిని లేదా సౌజన్య రెడ్డి మరియు నాకు అర్ధరాత్రి లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ఒకరా లేక వేర్వెరా ? తెలుసు కోవడానికి నేను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను…
సురేష్ : ఏంట్రా అది….
రఘు, సురేష్ ప్లానింగ్ మొత్తం వివరిస్తాడు. సురేష్ కూడా దానికి అంగీకరిస్తాడు. తనకు తెలిసిన ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఫ్రెండ్ కి , మెసేజ్ లు చేస్తున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో మరియు అడ్రస్ కనుక్కో అంటూ ఆ నంబర్ ని తన మిత్రుడుకీ యిస్తాడు సురేష్. తర్వాత ఇంకో మిత్రుడికి ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి ,ఆమె నంబర్ నీ సెండ్ చేస్తాడు.
చూస్తుండగానే సాయంత్రం అయింది.రఘు మరియు సురేష్, వారితో పాటు మరో ఇద్దరు మిత్రులు ఒకరు సిద్ధాంతి గారు అందరూ కలిసి రాత్రి 11 గంటలకు , అక్కడున్న దయ్యం గుట్టు తేల్చడానికి బీచ్కి బయలుదేరుతారు కార్ లో.రఘు మాత్రం బైక్ ను డ్రైవ్ చేస్తూ ముందుకు దారిచూపుతాడు. అది అర్ధరాత్రి అమావాస్య కావడం వల్ల బీచ్ లో ప్రశాంతంగా ఉన్న సంద్రం కూడా గంభీరంగా, ఉవ్వెత్తున లేచే కెరటాలతో మనుషులను సైతం మింగెలా ?
ఎగసి ఎగసి పడుతున్నాయి. పచ్చని ప్రకృతి సైతం ప్రకంపనలు చేస్తూ బీతి కలిగిస్తుంది. ఆకాశంలో ఇంకా గబ్బిలాలు తిరుగుతూనే ఉన్నాయి. పెద్దపెద్ద వృక్షాలు గాలికి శబ్దాలను చేస్తున్నాయి. ఆ రహదారి వెంట కారు ప్రయాణిస్తుంటే , గాలి వచ్చి ముందుకు వెళ్ళకంటూ జోరుగా వెనక్కి నెడుతోంది. ఇలా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను చూసి కూడా, భయం భయం తోనే కారు ముందుకు సాగుతుంది.
అందరి సిద్ధాంతి గారి పై నమ్మకం పెట్టి ఉంచారు నా స్నేహితులు.రఘు మాత్రం చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు. రఘు బైక్ ని ఆపాడు. వెనక వారికి సైగ చేశాడు. వారందరూ కూడా సిద్ధాంతితో పాటు చీకటిగా ఉన్న బీచ్ వైపు రఘును అనుసరిస్తూ వెళ్తున్నారు. సిద్ధాంతి గారు మంత్రాలు చదువుతున్నాడు.
మురళీ గీతం – 8374885700
Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry