ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Ghost Stories – Telugu Horror Stories – దెయ్యాల కథలు – హర్రర్ కథలు
“ఛ,సురేష్ మాటలు విని అప్పుడే వానితో పాటు హాయిగా వెల్లుంటే బాగుండేది..ఇప్పుడు ఇంత భయం ఉండేది కాదంటూ..”తనలో తను బాధ పడతాడు.అంతలోనే ఆకస్మాత్తుగా తన ఎదురుగా కొంచెం దూరంలో రోడ్డుపై ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్టు కనబడుతుంది.గుండె ఒకేసారి ఝల్లుమంది. హార్ట్ బీట్ వేగంగా పెరిగింది.
“లోపల భయం గూడు కట్టుకున్న ,బయట ధైర్యంగా బండి డ్రైవ్ చేస్తాడు.రోడ్డుపై ఏమీ కూడా కనిపించదు.తనకు కనబడిన రూపం సడెన్గా మాయం అవుతుంది.” అంతా అయోమయం గందరగోళంగా ఉంది.రఘుకి ఏం చేయాలో తోచడం లేదు. అలా బీచ్ వంక చూస్తాడు. ఒకేసారిగా తన గుండెలదురుతాయి.ఒక తెల్లని చీర కట్టిన అమ్మాయి అలా గాలిలొ దూరంగా బీచ్లో ఎగురుతూ కనిపిస్తుంది.బామ్మ చెప్పినవి అన్నీ నిజాలే అన్న విషయం గుర్తొస్తుంది రఘుకి.అది చూసిన రఘు వెంటనే భయంతో బైక్ ని మరింత స్పీడ్ గా నడుపుతాడు.
“ఈరోజు ఈ దయ్యాలను దాటుకొని నేను ఇంటికి వెళ్తానో లేదో”..అనుకుని ముందు వచ్చే మూలమలుపు చూసుకోలేదు. దగ్గరికి వచ్చాక… తనకు కనబడుతుంది రోడ్డుమీద..u turn .. సడన్ బ్రేక్ వేస్తాడు. బండి లోయలో పడుతుంది. తను ఒడ్డుపై పడతాడు. “హమ్మయ్య!” అనుకుంటాను రఘు,తనకి ఏమి కాలేదు.చిన్న చిన్న గాయాలు తప్ప.
తనకి ఏమీ దిక్కు తోచడం లేదు.సమయం సరిగ్గా 12 అవుతుంది. బైక్ లోయలో పడిపోయింది .ఈపాటికి అది నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటుంది.నేను బాగానే ఉన్నా..కొంచెంలో ప్రాణాపాయం తప్పింది అనుకుంటూ అతనికి ఇష్టమైన దేవుడు శ్రీ కృష్ణుడిని తలుస్తాడు రఘు. ఆ సమయం 12 చూసినప్పటి నుండి తనలో భయం మరింత ఉదృతంగా పెరిగింది.బీచ్లో ఎవ్వరూ కూడా కనబడరు.
ఆ రోడ్డు మూల మలుపు తిరిగిన తర్వాత స్మశానం ఒకటి వస్తుంది.అడవి చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు రెండు వైపులా స్మశానం వ్యాపించి ఉంది. తను రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అడవిలో చాలా దూరంగా, స్మశానంలో కుక్కలు మరియు నక్కలు అత్యంత భయంకరంగా, మనిషికి భీతి కలిగేలా కూ.కూ. అని అరుస్తున్నాయి. గాలి చల్లగా వీస్తోంది, కొంత కొంత ఉదృతంగా , ఉద్రిక్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
అది చూసి రఘులో భయం కలిగింది. భయం భయంగానే బండి వదిలేసి, నడుస్తూ వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా పది కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఇంటిని చేరాలంటే, ఎవరైనా వచ్చి లిఫ్ట్ ఇస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాడు. కానీ ఎవరూ రావడం లేదు. అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా అతని ముందు నుండి వేగంగా ఒక మనిషిని వెళ్లినట్టు అనిపించింది, ఆ రూపం యొక్క వాసన మరియు గాలి కూడా తగిలింది తనకు. రఘులో మరింత భయం పట్టుకుంది,ఏమై ఉంటుందో ఆ ఆకారం వైపు చూస్తాడు అక్కడ ఏమి కూడా కనబడదు, ఒక కుక్క కనబడుతుంది.
Telugu Ghost Stories – Telugu Horror Stories
హో హో కుక్కేనా ,నేను ఇంకేదో అని చాలా భయపడ్డాను అనుకుంటూ కర్చీఫ్ తీసుకొని తన మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటాడు. అంతలో వెనకనించి ఎవరు తన భుజం మీద చెయ్యి వేస్తారు. రఘుకి ఒకే సారి గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడి నుండి పారిపోదామని అనుకుంటాడు. కానీ అది వెంబడిస్తుంది మళ్లీ అని భయం, ధైర్యం తెచ్చుకుని వెనక్కి చూస్తాడు.వెనక్కి తిరిగి చూస్తే ఒక అందమైన అమ్మాయి స్కూటీ మీద వచ్చి ఉంటుంది.
ఆ అమ్మాయిని చూసి ఒక్క సారిగా షాక్ అవుతాడు. మళ్లీ మనసులో అనుమానాస్పదంగా వాళ్ళ బామ్మ చెప్పినట్టుగా దయ్యమే ఇలా అమ్మాయిగా వచ్చిందా అని అనుమానపడతాడు. ఆ అమ్మాయి కూడా అందమైన తెల్లని పంజాబీ డ్రెస్ లో ధగధగా మెరిసిపోతూ ఉంది.ముఖానికి అడ్డంగా స్కార్ఫ్ కట్టుకొని ఉంది. కురులు గాలికి ఊగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి వాలకం చూసి నిజంగా దయ్యమే వచ్చింది అనుకుంటాడు రఘు.
మురళీ గీతం – 8374885700
Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry