25 బెస్ట్ తెలుగు కోట్స్ – Telugu Best Quotes
భరించలేకపోతున్నావా..
అయితే దాన్ని ఎదురించి
పోరాడటం నేర్చుకో.
పోరాడలేకపోతున్నావా..
అయితే దాన్ని భరించి
బ్రతకడం నేర్చుకో .
మనసు ఎంత నిర్మలంగా,
నిజాయితీగా ఉంటే..
దానిని కంట్రోల్ చెయ్యడం
అంత సులభం.
ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు,
ముఖ్యంగా సొంతవారిని
మనవాడు, మన ఊరివాడు,
మన కులం వాడు అని నమ్మితే..
మోసపోక తప్పదు.
ఆ దేవుడిని
కష్టాలు రాకుండా చూడమని ప్రార్థించకు
వాటిని ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థించు.
నిజమైన ఆనందం, సంతృప్తి
కష్టాలను ధైర్యంగా
ఎదుర్కున్నప్పుడే దొరుకుతుంది.
ఆలోచింపజేసే జీవిత సత్యాల – Harsh Realities in Telugu
అదృష్టం అంటే ఆస్తులుండటం కాదు
చేతి నిండా పని ,
కడుపు నిండా తిండి,
కంటి నిండా నిద్ర,
కష్టసుఖాలను పంచుకునేందుకు
ఓ నలుగురు మనతో వుండటం.
ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే,
మనం గడిపే ప్రతిరోజు
అందంగా ఉంటుంది.
బదులిచ్చే విధానంతో
సగం ప్రపంచాన్ని గెలవొచ్చు.
నిలకడ లేని వారి కోసం నిలబడకు
అది నీకే ప్రమాదం.
వాళ్ళు ఒడ్డున పడి
నిన్ను ఊబిలోకి…!
తోసేస్తారు జాగ్రత్త..
ఒక మగవాడి మానసిక బాధను
ఎవరూ గుర్తించరు,
అది కోపంగా మారే వరకు.
కోపంగా మారగానే అతన్ని
ఒక కోపిష్టిగా, విలన్ లాగా చూస్తారు.
జీవితానికి ఉపయోగపడే టాప్ 35 కోట్స్ – బెస్ట్ లైఫ్ కోట్స్
నీవు ఈ మూడింటిని పొందొచ్చు.
ఙ్ఞానం,
సమయం,
డబ్బు.
వీటిలో ఏది కావాలన్నా
మిగతా రెండిటినీ వాడాలి.
కాలానికి అందరూ
బంధువులే..
వచ్చి పోయేవారే కాని
ఉండిపోయేవారు
ఎవరూ లేరిక్కడ.
నేటి మనిషి
అర్థం చేసుకోవడంలో
వెనకుంటాడు,
అపార్ధం చేసుకోవడంలో
ముందుంటాడు.
నటించడం రానప్పుడు
నేను ఎవ్వరికీ నచ్చలేదు,
నటించడం నేర్చుకున్నాక
నాకు నేనే నచ్చడం లేదు.
ఇప్పుడున్న రోజుల్లో
మంచితనం అనేది
అస్సలు పనికిరాదు.
ఎదుటివారు
మనతో ఎలా ఉంటే
మనం కూడా వాళ్లతో
అలానే ఉండాలి.!
“కోరిక” కొన్నాలే బ్రతికిస్తుంది.
“ఆశ” చచ్చేదాకా బ్రతికిస్తుంది.
కానీ..
“ఆశయం” చావే లేకుండా చేస్తుంది.
టాప్ 50 రియాలిటీ కోట్స్ – Reality Quotes in Telugu
మనిషిలో “అహం” తగ్గిన రోజు “
ఆప్యాయత” అంటే అర్ధం అవుతుంది.
“గర్వం” పోయిన రోజు ఎదుటివారిని ఎలా “గౌరవించాలో” తెలుస్తుంది.
“నేనే”, “నాకేంటి !” అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది.
“గౌరవమర్యాదలు” ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే “మంచి జీవితం”.
చేతినిండా పని,
కడుపునిండా తిండి,
కంటినిండా నిద్ర,
అవసరానికి ఆదుకునే ఆప్తులను
కలిగి ఉండడమే అసలైన “అదృష్టం”.
జీవితంలో తెగింపు లేకపోతే
ఎప్పటికీ కొన్ని సమస్యలకి
ముగింపు పలకలేము.
ఈ రోజుల్లో
బంధాలు బలంగా వుండాలంటే
మనల్ని మనం కోల్పోయి,
పూర్తిగా వారికి నచ్చినట్లు వుండాలి.
మనకు నచ్చినట్లు
బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం
ఆ బంధం ముగుసినట్టే..
ఆకలితో వున్నోడు గుడి బయట,
ఆశలతో వున్నోడు గుడి లోపల
ఇక్కడ అందరు ముష్టివాళ్లే..
ఆలోచనలు, జ్ఞాపకాలు పారే నీరు లాంటివి.
వాటిని దారి మళ్లించాలే కానీ పూర్తిగా ఆపలేము.
మీ చేదు గతాన్ని మీరు మరిచిపోలేకపోవచ్చు,
కానీ మీ ఆలోచనలని, దృష్టిని
వేరేవాటిమీదకి మరల్చవచ్చు.
స్వతంత్రంగా సమాజం మారదు,
స్వచ్చందంగా మనిషే మారాలి.
అవసరానికి ఇచ్చింది
అర్ధ రూపాయి అయినా
అది తీర్చుకోలేని రుణం.
అప్పు చేసినవాడు
ఆ అప్పు తీరే వరకు
అప్పు ఇచ్చినవాడికి
బానిసగానే వుంటాడు.
ఒకప్పుడు..
పురోహితులు చెప్పిన ముహూర్తానికి
తాళి కట్టేవారు.
ఇప్పుడు..
ఫోటోగ్రాఫర్లు చెప్పినప్పుడు
తాళి కడుతున్నారు.
మనిషి ముహూర్తాలు చూసుకోకుండా
పుడతాడు, చస్తాడు.. కానీ,
మిగిలిన కాలమంతా
ప్రతి దానికి ముహూర్తం అంటూ
పట్టు పడతాడు.
ఇప్పుడు నువ్వు గడుపుతున్న ప్రతి క్షణం
ఎప్పుడోకప్పుడు నీ జీవితంలో
మరో క్షణాన్ని ప్రభావితం చేస్తుంది.
ఒక్కసారి ఆలోచించు
ప్రపంచంలో మొదటి గురువుకి
చదువు చెప్పింది ఎవరు?
నువ్వు నేర్చుకోవడానికి ఎక్కడికో,
ఎవరి దగ్గరికో వెళ్లాల్సిన అవసరం లేదు.
నీకు నువ్వే గురువు కావాలి, కాగలవు.
ప్రతి రోజు కొత్తది నేర్చుకోవాలి, నేర్చుకోగలవు.
అద్బుతమైన తెలుగు కోట్స్ – Greatest Quotes in Telugu – 2024