Menu Close

పిల్లలు పల్లెల్లోనే పెరగాలి.!

తాడిపత్రి నుండి పల్లెకు పోయేటప్పుడు…
నాన్నా! పల్లెలో ఒన్ డే ఉండి వచ్చేద్దాం.
అలాగే నాన్నా!
పల్లెకు పోయి తోటలో ఇంటికి పోయి చుట్టూ ఉన్న కూరగాయలు పండ్లు చూశాక….
నాన్నా! పల్లెలో త్రీ డేస్ ఉండి మళ్లా పోదాం.
అలాగే నాన్నా!
తోటలో ట్రాక్టర్ సేద్యం చూశాక…
నాన్నా! త్రీ డేస్ కాదు ఫోర్ డేస్ ఉందాం.
అలాగే నాన్నా!


తోటలో నుండి ఇంటికి వచ్చేపుడు చెరువు మరవ నీళ్లలో దిగినప్పుడు..
నాన్నా! ఫోర్ డేస్ కాదు ఫైవ్ డేస్ ఉందాం.
అలాగే నాన్నా!
రాత్రి ఇంట్లో కోళ్లను గంపల కింద మూసేటపుడు…
నాన్నా! ఫైవ్ డేస్ కాదు సెవెన్ డేస్ ఉందాం.
అలాగే నాన్నా!
పొద్దున్నే కోళ్లను గంపల కింద నుండి ఎత్తాక వాటితో ఆడుకునే టపుడు…
నాన్నా! సెవెన్ డేస్ కాదు టెన్ డేస్ ఉందాం.
అలాగే నాన్నా!
వంక నీటిలో వాటర్ డ్యాన్స్ ఏస్తున్నపుడు…
నాన్నా! మనం వన్ మంత్ పల్లెలో ఉండి పోదాం.
అలాగే నాన్నా!


చెరువు మరవ నీళ్లలో ఈత కొట్టే టపుడు…
నాన్నా! మనం వన్ ఇయర్ ఇక్కడే ఉండి పోదాం.
అలాగే నాన్నా!
వరి పొలం చుట్టూ తిరుగుతూ మధ్యలో బావి, బావి గట్టున గిజిగాడి గూళ్లు చూశాక…
నాన్నా! మనం ఇంక ఇక్కడే పల్లెలోనే ఉండి పోదాం.
ఎందుకు నాన్నా!


మనకు తోటలో చెట్లకు కాసిన కూరగాయలు, పండ్లు ఉన్నాయి. మార్కెట్ కు పోయి కొనకుండా.. మన చెట్ల కాయలు తినొచ్చు. ఇంట్లో చాలా కోళ్లు ఉన్నాయి. చికెన్ షాపులో కొనకుండా కోడి కూర తినొచ్చు. వంకలో, చెరువులో చేపలు ఉన్నాయి అవి పట్టుకొని తినొచ్చు. మనకు వరి పొలం ఉంది కదా. దుబ్బ సెట్టి అంగళ్లో బియ్యం కొనకుండా…వరి కోసుకొని అన్నం తినొచ్చు. వంకలో, చెరువులో ఈత కొడుతూ… నీళ్లలో ఆకులతో తూములు కట్టి… ఇంటి ముందు మట్టిలో గిజిగాడి గూడు లాగా గూడు కట్టి ఆడుకోవచ్చు. కరోనా వచ్చి ఇంట్లోనే ఉండకుండా… పల్లెలో ఇంటికి – తోటలో ఇంటికి అటూ ఇటూ తిరుగుతూ దారిలో నీళ్లలో దిగి ఈత కొడుతూ ఆడుకోవచ్చు. తోటలూ, వరిపొలం చుట్టూ తిరగొచ్చు.
మరి చదువు నాన్నా!


కరోనా వచ్చి స్కూలు మూసేశారు కదా! బుక్కులు తెస్తే… ఆడుకొని ఇంటికి వచ్చాక చదువుకుంటా నాన్నా!
అమ్మా! నాన్నా! రోజూ ఆఫీసుకు పోవాలి కదా నాన్నా!
లీవు పెట్టేసి… అందరం పల్లెలో ఉండి పోదాం నాన్నా!
అసంకల్పితంగా నాన్న కళ్లలో కన్నీళ్లు.
నాన్నేమో ఇవన్నీ చేస్తూ చదువుతూ ఎదిగాడు. కొడుకేమో వీటికి దూరంగా కాంక్రీటు జంగిల్లో పెరుగుతున్నాడు.
ఇప్పుడు పల్లె నుండి పిలుచుకు రావాలంటే… ఏం మాయ మాటలు చెప్పాలో.
పల్లె తల్లి వంటిది. పట్నం ప్రియురాలు వంటిది. తల్లి ఒడిలో సేద తీరితే కలిగే సౌఖ్యం… ప్రియురాలి వంపుసొంపుల బిగి కౌగిళిలో… లభించదు.

గమనిక: ఇదేదో సరదాగా రాసింది కాదు. పల్లె అందాలకు పులకిస్తూ… బాబు నోటి వెంట వచ్చిన మార్పులకు అక్షర రూపం. పట్టణ బతుకును పల్లె బతుకును పోల్చి చెబుతుంటే… అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను.

రాజ గోపాల్ రెడ్డి వుబ్బర

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images