Menu Close

మా అమ్మ ఇంకా బతికే ఉంది – Emotional Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మా అమ్మ ఇంకా బతికే ఉంది – Emotional Stories in Telugu

తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన అధ్బత కధనం, తప్పకుండా మీరు చదవండి.

అమ్మాయి పెళ్ళి నిశ్చయ అయింది, తాంబూలాలు పుచ్చుకున్నారు, అది కూడా ఓ గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబంలో అందరూ ఎంతో సంతోషించారు, తండ్రి కూడా ఎంతగనో ఆనందించాడు. పిల్లవాడు మరియు అతని తల్లిదండ్రులు చాల మంచివారు, దాంతో పెళ్ళికూతురు తండ్రికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది.

పెళ్ళికి ముందే, ఓ రోజు పెళ్ళికూతురు తండ్రికి, వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళలసివస్తుంది, ఆరోజు పెళ్ళికూతురు తండ్రికి, ఆరోగ్యం బాగాలేదు, కానీ మొదటిసారి కావడంతో కాదనలేకపోయారు, వరుని ఇంటికి వెళ్ళినప్పుడు, వరుని తరపువాళ్ళు, ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు.

కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది, పెళ్ళికూతురు తండ్రికి, మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారు, అయితే మగపెళ్ళి వారింటిలో మొహమాటంతోనే ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు.

Father and Daughter Emotional Story in Telugu

మొదటి గుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు, అందులో పంచదార లేదు సరికదా, తనకిష్టమైన యాలకుల పొడి వేశారు. తన ఇంటిలో చేసిన పధ్ధతిలోనే, టీని వరుని ఇంటిలో తాగుతున్నట్లు అనిపించింది, మధ్యాహ్నం భోజనం చేశారు, అదీ కూడా అచ్చు తమ ఇంటిలో వంటకాలు వండే విధంగానే ఉంది.

ఆ తరువాత, మీరు ఇప్పుడే ఏం బయలుదేరుతారండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి, అంటూ పడకగదికి తీసుకెళ్ళారు, అక్కడ తను కప్పుకునే పలచటి దుప్పటి లాంటి దుప్పటి ఉంది, కునుకుతీసి నిద్ర లేచేసరికి రాగి చెంబులో నీరిచ్చారు తాగడానికి. బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు పెళ్ళికూతురు తండ్రి.

నేను ఏం తింటాను ..
ఎలా తాగుతాను ..
నా ఆరోగ్యానికి ఏది మంచిది ..
ఇవన్నీ మీకెలా తెలుసు .. ?

అమ్మాయి అత్తగారు ఇలా అంది, నిన్న రాత్రి మీ అమ్మాయి ఫోన్ చేసి మీ గురించి అన్నీ చెప్పిందండి, మా నాన్నగారు మొహమాట పడతారు, వారి గురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలని కోరింది. పెళ్ళికూతురు తండ్రి కళ్ళల్లో నీరు తిరిగాయి, ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు, మా అమ్మ ఇంకా బతికే ఉంది. ఏమిటండీ మీరు మాటాడుతున్నది, అవును, నన్ను కంటికి రెప్పలా చూసుకొనే, నా తల్లి బతికే ఉంది, నా కూతురు రూపంలో బతికే ఉంది, అని, జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు పెళ్ళికూతురు తండ్రి తన భార్యతో, కన్నీరు నిండిన కళ్ళతో..

Father and Daughter Emotional Stories in Telugu.jpg

అమ్మాయి మన ఇల్లు వదిలి పోతుందని అనుకొంటాము, తను ఎక్కడికీ పోదు, తలిదండ్రులను తన హృదయాలలోనే ఉంచుకుంటుంది, తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకొని.

“అమ్మాయిని బతకనిస్తే,
అమ్మను గౌరవించినట్లే”

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Parenting Tips in Telugu – ఇప్పుటి తరం 70% పిల్లలు ఇలానే వున్నారు కారణం..?
Parenting Tips in Telugu – పిల్లల ముందు ఈ మాటలు అస్సలు మాట్లాడకండి.

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading