మన పిల్లల తలరాతలు దేవుడు కాదు మనమే రాయాలి.
పిల్లలు మనం చెప్పే మాటల వినరు, కానీ
మనం చేసేవి చూసి అలానే చేస్తారు.
అందుకని మన పిల్లల ముంది మన నడవడిక చాలా జాగ్రతగా వుండాలి. వారే మన ప్రపంచం కదా.. పిల్లలు లేని వాళ్ళని అడగండి, పిల్లలున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో చెప్తారు. అలాంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

అలాంటి పిల్లల ముందు ఈ మాటలు అస్సలు మాట్లాడకండి
కంపారిజన్: దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ పేరెంట్స్ లో ఈ పని చేయని వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. పిల్లల్ని ఇంకోకరితో కంపేర్ చెయ్యడమంటే వాళ్ళని లెక్కలేకుండా చూడడం. వాళ్ళెంత ట్రై చేసినా పేరెంట్స్ వాళ్ళని మెచ్చుకోరని వాళ్ళకి అర్ధమైపోతుంది.
దీనివల్ల అనవసరమైన ఈర్ష్య అసూయలు పెరుగుతాయి. దీని బదులు పిల్లలకి వాళ్ళెంత ప్రత్యేకమో, మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో చెప్పండి. మీ పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు కూడా ఎలాంటి కంపారిజన్స్ పెట్టుకోకుండా చూడాలి.

బాడీ షేమింగ్: నువ్వూ చూడ్డానికి బావుండవు. నువ్వు సన్నగా, లావుగా, అసహ్యంగా బక్కగా.. ఉంటావు లాంటి మాటలు అస్సలు అనకూడదు. ఇది వారిలో అభద్రతాభావాన్ని పెంచుతాయి. ఇంక వాళ్ళు వాళ్ళ రూపాన్ని తప్ప ఇంక దేని గురించీ ఆలోచించలేరు.
దీని మూలంగా ఎక్కువ తినడమో, తక్కువ తినడమో చేస్తారు. పిల్లలు వారి రూపాన్నీ, రంగునీ అంగీకరించాలంటే ముందు తల్లిదండ్రులకి అసలు ఆ ధ్యాస ఉండకూడదు. అప్పుడే పిల్లలకి వారు చెప్పగలుగుతారు – ఎలా ఉన్నా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవాలని. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం మిన్న అని వారు అర్ధం చేసుకోగలుగుతారు.
నువ్వు పుట్టకుండా ఉంటే: నువ్వసలు పుట్టకుండా ఉంటే బావుండేది, మీ తమ్ముడు నీకంటే పెద్దయ్యుంటే బావుండేది, నాకు అబార్షన్ అయ్యుంటే బావుండేది, నువ్వు అమ్మాయి/అబ్బాయిగా పుట్టి ఉంటే బావుండేది..
ఇలాంటి మాటలు ఐడెంటిటీ క్రైసిస్ కి దారి తీస్తాయి. నేను అనవసరంగా పుట్టాను అనిపిస్తుంది. ఇది తనకి తాను హాని చేసుకోడానికీ, డిప్రెషన్ కీ దారి తీస్తుంది. పిల్లలు వాళ్ళకి ఎంతో స్పెషల్ అనే విషయాన్ని వాళ్ళు అర్ధం చేసుకునేలాగా పేరెంట్స్ ప్రవర్తించాలి.

కఠినంగా మాట్లాడడం: నువ్వెందుకూ పనికిరావు/నీకు ప్రతీదీ పదిసార్లు చెప్పాలి/నువ్వొక ఫెయిల్యూర్/నీ అంత స్టుపిడ్ ని నేనెక్కడా చూడలేదు/డంబెస్ట్ పర్సన్ అవార్డ్ అంటూ ఉంటే అది నీకే వస్తుంది.. లాంటి మాటలు పిల్లల మనసుల మీద చెరగని ముద్ర వేస్తాయి. తిట్టటం కంటే వాళ్ళలో సహనం, ధైర్యం, దయ పెంచడానికి కృషి చేస్తే వాళ్ళు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారు.

అబద్ధాలు చెప్పడం: నీకది కొనిస్తా, అది చేస్తా, నెక్స్ట్ టైం డెఫినిట్ గా అక్కడుంటా.. లాంటి మాటలు అంటారు కానీ చెయ్యరు చాలా మంది పేరెంట్స్. ఇప్పటికి తప్పించుకుందాంలే అన్న ధోరణి ఎక్కడైనా పనికొస్తుందేమో కానీ పిల్లల దగ్గిర కాదు.
మీరు తీర్చలేని ప్రామిస్ లు చేయకండి. ఎందుకంటే పిల్లలు మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. మనం చేసిన ప్రతి ప్రామిస్ మనం నిలబెట్టుకోలేకపోవచ్చు. అది ఎవ్వరికీ సాధ్యం కాదు, కానీ తీర్చగలిగిన ప్రామిస్ లు తీరిస్తే, తీర్చలేని వాటిని పిల్లలు అర్ధం చేసుకుంటారు. వాళ్ళు పిల్లలే కానీ శత్రువులు కాదు కదా.

రెచ్చగొట్టే మాటలు: నీకింకా మెచ్యూరిటీ రాలేదు/నీ మీద బోలెడంత ఖర్చు పెట్టాను/నిన్ను చూస్తేనే నాకు విసుగ్గా ఉంటుంది… లాంటి మాటల వల్ల పిల్లలు ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు. తల్లిదండ్రులతో ఏ విషయాన్నీ ధైర్యంగా పంచుకోలేరు. బయటివాళ్ళు కూడా వాళ్ళ గురించి ఇలాగే అనుకుంటారేమో అన్న భయం తో ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా జీవిస్తారు.

ఇప్పుటి తరం 70% పిల్లలు ఇలానే వున్నారు కారణం..? తల్లితండ్రులు తప్పకుండా చదవండి.
Parenting Tips in Telugu, తప్పకుండా మీకు తెలిసిన వారికి షేర్ చెయ్యండి.