Menu Close

Father and Daughter Emotional Story in Telugu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Father and Daughter Emotional Story in Telugu

అత్తవారింటికి వెళ్ళిన తన గారాల పట్టి, తన కుమార్తె తల్లి,దండ్రులను చూడాలని పుట్టింటికి వచ్చింది. ప్రేమగా తన తండ్రి రెండు చేతులను ముద్దాడి, యిలా అడిగింది కుమార్తె.. నాన్నా, మీరు ఏరోజూ నన్ను, చిన్న మాట అనలేదు. మీకారణంగా నేను ఏ ఒక్కరోజు కూడా బాధ పడినట్లు జ్ఞాపకం లేదు.

కానీ నాకే ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తుంది నాన్నా నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టానా? నా కారణంగా మీరెప్పుడైనా కన్నీరు కార్చారా? చెప్పండి నాన్నా అంటూ బతిమాలింది.

అప్పుడు ఆ తండ్రి ,హా అవును అమ్మా, నేను నీ వల్ల ఒకసారి కన్నీరు కార్చాను. అనగానే ఆ కుమార్తె కళ్ళ నిండా నీళ్లతో ఎప్పుడు నాన్నా చెప్పండి అంటూ తండ్రి కళ్ళలోకే చూస్తూ అడిగింది.

Father and Daughter Emotional Stories in Telugu.jpg

అప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో నీటి పొరలు కమ్ము చుండగా ఆనాటి ఒక మధురమైన స్మృతిని జ్ఞాపకం చేసుకుంటూ యిలా చెప్పసాగాడు.

అప్పుడు నీకు ఆరు నెలలు, అన్న ప్రాసన కార్యక్రమం ,నీ ముందు ఎంతో విలువైన వస్తువులు ఉంచారు. డబ్బు,బంగారం,పెన్ను,పుస్తకం యిలా, నువ్వు మెల్లగా పాకుతూ వాటి వైపు వస్తున్నావు.అక్కడ ఉన్న వారందరూ నీవు ఏ వస్తువును పట్టు కుంటావోనని చాలా ఆసక్తిగా నిన్నే చూస్తున్నారు.

నీవూ వాటి దగ్గర వరకూ వచ్చావు. కానీ దేనినీ ముట్టుకో కుండా మెల్లగా పక్కకు జరిగి దూరంగా అందరితో పాటు కూర్చున్న నా దగ్గరకు పాకుతూ వచ్చి నా వొడిలో కూర్చున్నావు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.

కానీ నేను మాత్రం నిన్ను గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యాను. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను బంగారం అన్నాడు ఆ తండ్రి తన గారాల పట్టి మోమును తన చేతులతో తడుముతూ.. ..

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

SUBSCRIBE FOR MORE

Like and Share
+1
3
+1
0
+1
0

Subscribe for latest updates

Loading