ఒక రూమ్ లో ఆరు కోతులను ఉంచారు. ఆ రూమ్ మధ్యలో సీలింగ్ కి ఉన్న కొక్కేనికి ఒక అరటి పళ్ళ గెలను వేలాడదీశారు . దాన్ని చేరుకోడానికి వీలుగా ఒక నిచ్చెన ఏర్పాటు చేశారు .
ఏదైనా ఒక కోతి అరటి పండుకోసం నిచ్చెన ఎక్కగానే , ఎక్కే కోతి మీద వేడి నీళ్ళు షవర్ ద్వారా పోసేవారు . అది తట్టుకోలేక వెంటనే దిగి వచ్చేది .!
అలా అన్ని కోతులు ప్రయత్నించి వేడి నీళ్లు పడుతానే దిగి వచ్చేవి ..!
మొదట్లో వాటికి అర్ధం కాలేదు . కానీ అవి గ్రహించాయి . ఆ గదిలో అరటి పళ్ళు , నిచ్చెన , కోతులూ ముఖ ముఖాలు చూసుకుంటూ గడుపుతూ ఉండగా నిర్వాహకులు అందులో నుండి ఒక కోతిని తీసేశారు .
దాని బదులుగా ఒక కొత్త కోతిని గదిలోకి పెట్టారు . రాగానే కొత్త కోతి అరటిపళ్ళ కోసం వెడుతూ ఉంటె మిగిలిన అయిదు కోతులూ రాబోయే ప్రమాదం గ్రహించి దాన్ని దానిని ఎక్కనివ్వలేదు , పట్టుకుని చితక బాది కూర్చోబెట్టాయి . విచిత్రం ఏమిటి అంటే నిర్వాహకులు ఈ సారి షవర్ ఆన్ చేయలేదు.
కొంత సేపు పోయాక పాత కోతులు ఐదింటిలో ఒక దానిని తీసేసి కొత్త కోతిని ప్రవేశ పెట్టారు . అది అరటిపళ్ళ కోసం ఎక్కబోతోంది . వెంటనే పసి గట్టాయి మిగిలిన కోతులు . ఎక్కడ దాని మీద వేడి నీళ్ళు వచ్చి పడిపోతాయో అని ఎగిరి దానిమీదకు దూకి దాన్ని కుమ్మేసి కూర్చోబెట్టాయి. ఈ చర్యలో దెబ్బ తిన్న ఇందాక వచ్చిన కోతి కూడా కొత్త కోతిని కుమ్మేసింది ( ఎందుకు కుమ్ముతున్నానో నాకే తెలియదు అనుకుంటూ ) వేడి నీరు చిమ్మబడక పూర్వమే అవి అలా చేశాయి .
అలా మిగిలిన నాలుగు కోతుల స్థానం లో నాలుగు కొత్త కోతులు వచ్చాయి . షవర్ బందయింది . అయినా అవి అరటిపళ్ళ కోసం ప్రయత్నం చెయ్యబోయిన కొత్త కోతులను ఆపేశాయి.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.