Menu Close

Swathi Chinuka Song Lyrics In Telugu – Anaganaga O Ammayi

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Swathi Chinuka Song Lyrics In Telugu – Anaganaga O Ammayi

స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా… రావే కౌగిలింటి దాకా
చందమామ తునకా… రావే కౌగిలింటి దాకా
ఇంత చురకా వింత ఉరుకా ప్రేమే పుట్టాకా
అబ్బో ఆగడాల దుడుకా… అల్లే అల్లరింటి కొడుకా
ఆగడాల దుడుకా… అల్లే అల్లరింటి కొడుకా

చేరుకో నన్నే తారకా, ఓ ఓ… కోలుకోలేనీకోరికా, ఓఓ
నేరుగా వచ్చేసాక మోమాటమేముంది… ముద్దాడవే గోపిక
స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా… రావే కౌగిలింటి దాకా
చందమామ తునకా… రావే కౌగిలింటి దాకా

చీకటే నచ్చేసాక… తొందరే పుట్టేసాక
ఇష్టమైనదిస్తే యురేకా, ఓ ఓఓ
నాదనీ వేరే లేక… నీదనీ అందించాక
కట్టుకుంటనయ్యో తడాఖా
కల్లోకొచ్చి కల్లోలంగా కమ్ముకుపోయాకా
ఒళ్ళోకొచ్చి అల్లుకుపోతే ఆపడమెల్లాగ
మరేం మారుమాటలనకా… నన్నే చేరుకోవే చిలకా
మారుమాటలనకా నిన్నే చేరుకుంది చిలకా

స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా… రావే కౌగిలింటి దాకా
అబ్బో ఆగడాల దుడుకా… అల్లే అల్లరింటి కొడుకా

ముద్దుకే ఉన్నది బుగ్గ… తప్పుకో తప్పుడు సిగ్గా
ఒళ్ళు దాచుకుంటే ఎట్టాగా, ఓ ఓఓ
బుద్ధిగా ఉండని తిక్క… బొత్తిగా చూడదు లెక్క
మక్కువెక్కువైతే మజాకా, ఆఆ
ఆహా ఓహో అనిపించిందీ… అందం చూసాకా
ఊహా లోకం కనిపించిందీ దగ్గరకొచ్చాక
ఇదే మంచివేళ కనక… రావే మల్లెపూల కులుకా
మంచివేళ కనక… రావే మల్లెపూల కులుకా

స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా… రావే కౌగిలింటి దాకా
ఆగడాల దుడుకా… అల్లే అల్లరింటి కొడుకా
చేరుకో నన్నే తారకా, ఓ ఓ… కోలుకోలేనీకోరికా, ఓఓ
నేరుగా వచ్చేసాక మోమాటమేముంది… ముద్దాడవే గోపిక

Like and Share
+1
0
+1
2
+1
0

Subscribe for latest updates

Loading