Menu Close

Nee Navve Nagaswarame Song Lyrics In Telugu – Devi

Nee Navve Nagaswarame Song Lyrics In Telugu – Devi

ఆ ఆ ఆఆ హో ఆ ఆ ఆఆ హో
హెయ్, నీ నవ్వే నాగ స్వరమే… నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకాంబరమే
నీ ఒడిలో ఒక్క క్షణమే… నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే
కలిసి రావే కలల తార… వయసు మీటే ప్రియ సితార
ఊహలొలుకు సరిగమ పలికి

హేయ్ హేయ్ హేయ్ యాయా యయయో
హేయ్ హేయ్ హేయ్ యాయా యా
హేయ్ హేయ్ హేయ్ యాయా యయయో
హేయ్ హేయ్ హేయ్ యాయా యా

హ, పాలపుంత ప్రేయసి… పారిజాత సుందరి
రోదశికి ఆమని… ప్రేమలోక పౌర్ణమి
నీలాల మబ్బులోని… కూచిపూడి నాట్యాలమ్మ
వయ్యారి స్వాతిజల్లు… పైట చాటు ముత్యాలమ్మ
గోదారి తీరంలోని… సంధ్య రాగం కుచ్చిల్లమ్మ
మనసారా కోరుకున్నా ఓసారైన వచేల్లమ్మ
నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి
నవ్వే రువ్వి నా జంటే కావాలి

హెయ్, నీ నవ్వే నాగ స్వరమే… నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకాంబరమే
నీ ఒడిలో ఒక్క క్షణమే… నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే, హ

హే, మాఘమాసం వచ్చినాది నాయుడో
బంతి మొగ్గ విచ్చినాది
అద్దకాల పైట వచ్చి జారుతూ
పెద్ద సిగ్గు తెచ్చినాది
కోరచూపు గుండెల్లోకి… దూసుకెళ్లి
కోలోకోలో కోలాటాలు… ఏసినాది కొంటెపిల్లడో
మీసకట్టు మీద ఒట్టు… ఆశ పెట్టుకున్న దాన్ని
సెయ్యిపట్టి యాడకైనా తీసుకెళ్లరో

హ, నీలి నీలి ముంగురులు గాలిలోన గింగిరులు
అందగత్తెలందరికీ, హ… నిన్ను చూసి ఆవిరులు
నీలాగా పాడలేక కుకు కుకు కోయిలమ్మ
ఒక్కొక్క అక్షరాన్నే పట్టీ పట్టీ పాడిందమ్మా
జాబిల్లి చిన్నబోయి సున్నలాగా మారిపోయి
సిగ్గేసి నల్లమబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ
ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో
నిన్నే చేరి అయినాయే పారాణి

నా నవ్వే నాగస్వరమే… నా నడకే హంసరథమే
నా కులుకే కళల కనకాంబరమే
నా ఒడిలో ఒక్కక్షణమే… నీ మదిలో స్వర్ణయుగమే
నా వలపే వేయి జన్మల వరమే
కలిసిరానా కలల ఆశ… ననన నానా ననన నానా
సుధలొలుకు సరిగమ పలికి

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading