ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Suswagatham Navaragama Lyrics in Telugu – Suswagatham
Suswagatham Navaragama Lyrics in Telugu – Suswagatham
తందాన తాననానా తందనానా తాననానా
తందాన తాననానా తందనానా తాననానా
సుస్వాగతం నవరాగమా పలికిందిలే ఎద సరిగమ
ప్రియ దరహాసమ ప్రేమ ఇతిహాసమ
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైఖమ
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
ఆ… ఆ… పనిస గానినిసా (2)
పిందల్లే రాలే పువ్వా చిన్ని చిన్ని నవ్వులివ్వ
నీకోసం ప్రేణం పెట్టే చిన్నవాడ్ని చేరవా
సుస్వాగతం… నవరాగమా…
అంతేలేని వేగంతోని ప్రేమేవస్తుంటే
నేను ఆనకట్ట వేయలేనే ఆహ్వానిస్తుంటే
పట్టే తప్పే విరహంలోనే మునిగిపోతుంటే
ఇక క్షేమంగానే జీవిస్తా నీ చెయ్యందిస్తుంటే
ఆ చేతులే నీకు పూల దండగా
మెడలోన వేసి నీ జంట చేరనా
నా చూపు సూత్రంగా ముడిపడగా
నాజూకు చిత్రాల రాజ్యమేలనా
మౌనమేమాని గానమై పలికే నా భావన
ఆ… ఆ… పనిస గానినిసా (2)
శిలలాంటి గుండెకోసం శిల్పమల్లే మారిపోయి
చిత్రాల ప్రేమకోసం చక్కనైన వేళలో
సుస్వాగతం… నవరాగమా…
పపప ససస గప పపప ససస నిదప (2)
సూరీడున్నాడమ్మా నిన్నే చూపడానికి
రేయి ఉన్నాదమ్మా కలలో నిన్నే చేరడానికి
మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి
నా కళ్ళు పెదవి ఉన్నాయి నీతో నవ్వడానికి
ఏనాడు చూశానో రూపు రేఖలు
ఆనాడే రాశాను చూపులేఖలు
ఏ రోజు లేవమ్మా ఇన్ని వింతలు
ఈవేళ నాముందు ప్రేమ పుంతలు
ఏడు వింతలను మించేవింత మనప్రేమే సుమా
ఆ… ఆ… పనిస గానినిసా (2)
వర్షించే పూలమాసం చిన్నవాడి ప్రేమకోసం
అందాల నీలాకాశం అందుకున్న సంబరం
సుస్వాగతం నవరాగమా
పలికిందిలే ఎద సరిగమ
ప్రియ దరహాసమ ప్రేమ ఇతిహాసమ
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైఖమ
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
సుస్వాగతం… నవరాగమా…
Suswagatham Navaragama Lyrics in Telugu – Suswagatham