అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
వేసవి కాలం తీసుకోవాల్సిన జాగ్రతలు – Summer Health Tips in Telugu
ఎండాకాలం వచ్చేసింది. బయటకు వెళితే విపరీతమైన వేడి గాలులు, కళ్ళు తెరవలేనంత వేడి ఉంది. ఉండే కొద్దీ వేడి తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఎండాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే అనుమానం. ఎండాకాలంలో దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అలాగని ఎక్కువగా నీటిని తాగితే వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

కానీ ఎండాకాలంలో శరీరానికి కావల్సిన నీటి శాతాన్ని అందిస్తూ ఆరోగ్యాన్ని అధిక బరువు సమస్య లేకుండా కాపాడటంలో సహాయపడే ఆహారాన్ని ఎన్నుకోవడం చాలా అవసరం. దాని కోసం మనం మసాలాలు, నాన్ వెజ్, జంక్ఫుడ్ వంటివి వీలైనంత దూరంగా ఉంచాలి. అలాగే ఉదయం, సాయంత్రం ఉడికించిన ఆహారాల కంటే పచ్చిగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
అంటే కూరగాయల జ్యూస్, పండ్ల రసాలు, పండ్లు వెజ్ సలాడ్ వంటివి ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సమ్మర్లో ఎక్కువగా దొరికే వాటర్ మిలన్, కర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో లభిస్తాయి. ఇది శరీరంలో దాహార్తిని తీర్చడంతోపాటు శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.

ఈ సమ్మర్ లో మసాలాలు వంటివి తీసుకోవడం వలన దాహం ఎక్కువైపోతుంది. దీనివలన మనం ఉప్పు, పంచదార కలిపిన షర్బత్లు, కూల్ డ్రింక్ లను ఎక్కువగా తాగేస్తుంటారు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఏమీ కలపకుండా పండ్లరసాలు తీసుకోవడం వలన చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు.
సహజమైన నీటి శాతంతో పాటు శరీరానికి కావలసిన ఖనిజాలు కూడా లభిస్తాయి. ఉదయం మొలకలు, పండ్ల ముక్కలు తీసుకుని, మధ్యాహ్నం నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం, వాల్ నట్స్ వంటివి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన మాంసకృత్తులు లభిస్తాయి.

ఇక సాయంత్రం ఆరు గంటల సమయంలో పండ్ల ముక్కలు అంటే పుచ్చకాయ, కర్బూజ, జామకాయ, మామిడికాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎండాకాలం బొప్పాయి, అరటి పళ్ళు వంటివి అంతగా బాగుండవు. త్వరగా చెడిపోతాయి గనుక నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే కీరదోసకాయలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఆహారం అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇలాంటి సహజమైన ఆహారంతో ఎండ వేడిమి కూడా తగ్గించుకోవచ్చు.
వేసవి కాలం తీసుకోవాల్సిన జాగ్రతలు – Summer Health Tips in Telugu