Menu Close

Srirasthu Bobbili Simham Lyrics In Telugu – Bobbili Simham

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Srirasthu Bobbili Simham Lyrics In Telugu – Bobbili Simham

శ్రీరస్తు శుభమస్తు… కొత్త పెళ్ళి కూతురా కళ్యాణమస్తు
శ్రీరస్తు శుభమస్తు… మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
మా గుండె గుడిలో ఆశల ఒడిలో… జ్యోతిని వెలిగించగా
శ్రీరస్తు శుభమస్తు… కొత్త పెళ్ళి కూతురా కళ్యాణమస్తు

ఏ పూజకేపువ్వు రుణమై పూసిందో… కాలానికే తెలుసటా
ఆ కాలం కను మూస్తే… కలగా చెదిరేది జీవితమొకటేనటా
సవతిగ కాకుండా చెల్లిగా నను చూసి తల్లిని చేసావుగా
ఈ పారాణి పాదాలు సేవించినా గాని రుణమే తీరదుగా

ఇది కలకాలమై ఉండగా… నీ అనుబంధమే పండగా
ఇంటికి దీపం ఇల్లాలనిపించు… నా ముద్దు చెల్లాయిగా
శ్రీరస్తు శుభమస్తు… మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు

ఎదిగే మరణాన్ని ఎదలో దాచేసి… కథ రాసే దేవుడు
పంతాల గిరి గీసి, ప్రణయాన్ని ముడి వేసి… మోసం చేసాడు
రాగాల వెన్నెల్ని రాహువుతో చంపి… చీకటి మిగిలించితే
ఆ వేకువలా మళ్ళి రేకులు వెదజల్లే… రవియై పుడతాడులే

ఆ దీపంలో నీ రూపమే… ఓ పాపల్లె ఆడాలనే
ఊపిరి ఉయ్యాలై, ఊసుల జంపాలై… ఒడిలో ఆడేనులే
శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading