అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Sri Rama Navami Telugu Wishes, Quotes – శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

Sri Rama Navami Telugu Wishes 2022 – Shree Rama Navami Telugu Quotes
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!
అందరికి నవమి శుభాకాంక్షలు

శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

మనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే…
ఏటా మనమే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనింట్లో పెళ్లి మురిసిపోతాం.
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ
మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు

శ్రీ రామ నవమి ఎందుకు జరుపుకుంటారు – Why We Celebrate Sri Rama Navami
శ్రీ రాముని కథలు
Sri Rama Navami Wishes Telugu | Sri Rama Navami Quotes Telugu | Sri Rama Navami Greetings | Shree Rama Navami 2020 Wishes | Sir Rama Navami Telugu Wishes 2022 | Sri Rama Navami Wishes in Telugu 2022
Moral Stories From Ramayana in Telugu – నీతి కథలు
రామాయణం నీకేంత అర్ధమైంది – Sri Rama Navami Stories
శ్రీ రామ నవమి ఎందుకు జరుపుకుంటారు – Why We Celebrate Sri Rama Navami ?
రామాయణం కేవలం కథ కాదు – Evidence of Ramayana