Menu Close

Soundarya Lahari Swapna Sundari Song Lyrics In Telugu – Pelli Sandadi

సౌందర్య లహరి… సౌందర్య లహరి
సౌందర్య లహరి… స్వప్న సుందరి
నువ్వే నా ఊపిరి… ఆ ఆఆ
శృంగార నగరి… స్వర్ణ మంజరి
రావే రసమాధురి… ఆ ఆఆ
వన్నె చిన్నెల చిన్నారి… నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే… ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇలచేరి… కనిపించు ఓ సారి
సౌందర్య లహరి… స్వప్న సుందరి, నువ్వే నా ఊపిరి

శబరీబరాబరబ… శబరీబరాబరబ
పాల చెక్కిల్లు… దీపాల పుట్టిల్లు
పాల చెక్కిల్లు… దీపాల పుట్టిల్లు
అదిరేటి అధరాలు హరివిల్లులు
పక్కున చిందిన నవ్వులలో… ఆఆ ఆఆ ఆఆ
లెక్కకు అందని రతనాలు… ఆఆ ఆఆ ఆఆ
యతికైన మతిపోయే ప్రతి భంగిమ
ఎదలోనే పురివిప్పి… ఆడింది వయ్యారి
సౌందర్య లహరి స్వప్న సుందరి, నువ్వే నా ఊపిరి

నీలి కన్నుల్లు… నా పాలి సంకెల్లు
నీలి కన్నుల్లు… నా పాలి సంకెల్లు
నన్ను చూసి… వలవేసి మెలివెయ్యగా
ఊసులు చెప్పిన గుసగుసలు… ఆఆ ఆఆ ఆఆ
శ్వాసకు నేర్పెను సరిగమలు… ఆఆ ఆఆ ఆఆ
కలగంటి తెలుగింటి కలకంటిని
కొలువుంటే చాలంట… నా కంట సుకుమారి

సౌందర్య లహరి… స్వప్న సుందరి, నువ్వే నా ఊపిరి
సౌందర్య లహరి… స్వప్న సుందరి, నువ్వే నా ఊపిరి

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images