Menu Close

Snehanikanna Minna Song Lyrics Telugu – Prana Snehithulu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

స్నేహానికన్న మిన్న… లోకాన లేదురా
స్నేహానికన్న మిన్న… లోకాన లేదురా
కడ దాక నీడ లాగ… నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిదీ… నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేనురా
స్నేహానికన్న మిన్న… లోకాన లేదురా

తులతూగే సంపదలున్నా… స్నేహానికి సరిరావన్నా, ఓ
పలుకాడే బంధువులున్నా… నేస్తానికి సరికారన్నా
మాయ మర్మం తెలియని చెలిమే… ఎన్నడు తరగని పెన్నిధిరా
ఆ స్నేహమే నీ ఆస్తిరా… నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, ఆ
స్నేహానికన్న మిన్న… లోకాన లేదురా
కడ దాక నీడ లాగ… నిను వీడి పోదురా

త్యాగానికి అర్ధం స్నేహం… లోభానికి లొంగదు నేస్తం, ఓ ఓ
ప్రాణానికి ప్రాణం స్నేహం… రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది… నిర్మలమైనది స్నేహమురా
ధృవతారలా స్థిరమైనది… ఈ జగతిలో విలువైనది, ఈ స్నేహమొకటేనురా

స్నేహానికన్న మిన్న… లోకాన లేదురా
కడ దాక నీడ లాగ… నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది… నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా

Like and Share
+1
1
+1
2
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading