Sivangivey Song Lyrics In Telugu – Whistle – సివంగివే సివంగివే లిరిక్స్
మానినీ.. మానినీ… ఈ ఈ
అడుగులే ఝళిపించు… పిడుగులై ఒళ్ళు విరుచుకో
వినువీధి దారిన మెరుపులా…
భూమినే బంతాడు… కాలమే మీదే
ఇకపై లోకం వీక్షించెనిక… మగువల వీరంగం
సివంగివే సివంగివే… తలవంచే మగజాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా… సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ… కానీ కానీ
నీ హాసం లాసం వేషం రోషం… గర్వించేలా దేశమే
ఏరై పారే తీరై… ఏరి పారేయ్ తీరాలన్ని
వల్లకాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకు బాటవెయ్యి…
జారే జారే ధారే కంట… మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక… శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి
సివంగివే నువ్వే… సివంగివే సివంగివే…
తలవంచే మగజాతి నీకే…
నీ త్యాగమే గుర్తించగా… సాహో అంటూ మోకరిల్లదా
ఏరై పారే తీరై… ఏరి పారేయ్ తీరాలన్ని
వల్లకాదన్న వాళ్ళ నోళ్ళే… మూయించాలిక
కోరే భవితకు బాటవెయ్యి…
జారే జారే ధారే కంట… మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక… శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి
నువ్వీపని చెయ్యాలంటూ… నిర్దేశిస్తే నమ్మొద్దు
నీపైనే జాలిచూపే గుంపే… నీకు అసలొద్దు
ఊరే నిను వేరే చేసి… వెలివేస్తున్నా ఆగొద్దు
నీలోని విద్వత్తేంటో… చూపెయ్యాలి యావత్తు
లోకం నిను వేధించి… బాధిస్తున్నా పోనీవే
ప్రసవాన్ని చేధించి… సాధించే అగ్గి మొగ్గవే
కదలి రా… భువిని యేలగా యెగసి రా
అగ్గి మొగ్గవే… కదలి రా ఆ ఆ
నీ సరదా కలల్ని… కందాంరా
ఏ పరదాలైనా… తీద్దాంరా
ఏరై పారే తీరై… ఏరి పారేయ్ తీరాలన్ని
వల్లకాదన్న వాళ్ళ నోళ్ళే… మూయించాలిక
కోరే భవితకు బాటవెయ్యి…
జారే జారే ధారే కంట… మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక… శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి
సివంగివే సివంగివే… తలవంచే మగజాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా… సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ… కానీ కానీ
నీ హాసం లాసం వేషం రోషం… గర్వించేలా దేశమే
ఏరై పారే తీరై… ఏరి పారేయ్ తీరాలన్ని
వల్లకాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకు బాటవెయ్యి… చూడు చూడు
జారే జారే ధారే కంట… మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక… శక్తి నీవని
నీ భయముకి, నీ భయముకి… నీ భయముకి బదులునీయి.. ..
Sivangivey Song Lyrics In Telugu – Whistle – సివంగివే సివంగివే లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.