Menu Close

Sinni Sinni Korikaladaga Song Lyrics In Telugu – Swayamkrushi

సిన్ని సిన్ని కోరికలడగ… సీనివాసుడు నన్నడగ.. ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై… ఆతని సన్నిధి కొలువుంటా…

ఎరిగిన మనసుకు ఎరలేలే… ఏలిక సెలవికా శరణేలే…

ఎవరికి తెలియని కథలివిలే…
ఎవరికి తెలియని కథలివిలే
ఎవరో చెప్పగా ఇక ఏలే…

సిన్ని సిన్ని కోరికలడగ… సీనివాసుడు నన్నడగ.. ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై… ఆతని సన్నిధి కొలువుంటా…

నెలత తలపులే నలుగులుగా… కలికి కనులతో జలకాలు… ఊఉ ఊఉ
నెలత తలపులే నలుగులుగా… కలికి కనులతో జలకాలు…

సందిటనేసిన చెలువములే…
సందిటనేసిన చెలువములే…
సుందరమూర్తికి చేలములు… ఆఆ ఆఆ…

సిన్ని సిన్ని కోరికలడగ… సీనివాసుడు నన్నడగ.. ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై… ఆతని సన్నిధి కొలువుంటా…

కళల ఒరుపులే కస్తురిగా… వలపు వందనపు తిలకాలు…
ఊఉ ఊఉ… వలపు వందనపు తిలకాలు…

అంకము జేరిన పొంకాలే… అంకము జేరిన పొంకాలే
శ్రీ వెంకటపతికికా… వేడుకలు… ఉహు ఉహూ ఊఉ…

సిన్ని సిన్ని కోరికలడగ… సీనివాసుడు నన్నడగ.. ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై… ఆతని సన్నిధి కొలువుంటా… ||2||

Like and Share
+1
4
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading