రివ్వున ఎగిరే గువ్వా…
నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
ఓ ఓ ఓ… ఏ ఏ ఏ….
వీచే గాలుల వెంట… నా వెచ్చని ఊపిరినంత
పంపించానే అది… ఏ చోట నిను తాకనే లేదా…
పూచే పూవుల నిండా… మన తీయని జ్ఞాపకమంతా
నిలిపుంచానే… నువ్వు ఏ పూటా చూడనే లేదా…
నీ జాడను చూపించంటు ఉబికేనా… ఈ కన్నీరు
ఏ నాడు… ఇలపై పడి ఇంకిపోలేదు…
నడిరాత్రి ఆకాశంలో… నక్షత్రాలను చూడు…
అవి నీకై వెలిగే… నా చూపుల దీపాలు…
ఆ దారిని తూరుపువై రావా… ఆ ఆ
నా గుండెకు ఓదారుపు…
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
కిన్నెరసాని నడక… నీకెందుకే అంతటి అలక…
నన్నొదిలేస్తావా… కడదాక తోడై రాక… ఆ ఆ ఆ…
బతుకే బరువై పోగా… మిగిలున్న ఒంటరి శిలగా
మన బాశల ఊసులు అన్ని… కరిగాయా ఆ కలగా…
ఎన్నెన్నో జన్మలదాక… ముడివేసిన మన అనుబంధం
తెగి పోయిందంటే… నమ్మదుగా నా ప్రాణం…
ఆయువుతో ఉన్నాది అంటే… ఇంకా నా ఈ దేహం…
క్షేమంగ ఉన్నట్టే… తనకూడా నాస్నేహం…
ఎడబాటే వారదిగా చేస్తా… త్వరలోనే నీ జతగా వస్తా…
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
మంచును తడిసిన పువ్వా… నీ నవ్వులు ఎవ్వరివమ్మా…
నీ రాజు ఎవ్వరంటా… ఆ ఆ ఆ… ఈ రోజే చెప్పమంటా ఆ ఆ ఆ…
నీ రాజు ఎవ్వరంటా… ఆ ఆ… ఈ రోజే చెప్పమంటా ఆ ఆ…
అల్లరి పిల్లకు నేడు… వెయ్యాలి ఇక మెళ్ళొ తాడు…
ముడివేసే సిరిగల మొనగాడు… ఎవ్వరే వాడు… ఓ ఓ ఓ
చక్కని రాముడు వీడు…. నీ వరసకు మొగుడవుతాడు
ఇల్లాలిని వదిలిన… ఆ ఘనుడు ఈ పిరికోడు…
ఆ క్రిష్ణుని అంశన వీడే… నీ కొరకే ఇల పుట్టాడే…
గొపికలే వస్తే అటే పరిగేడతాడే… ఏ ఏ…
ఓ గడసరి పిల్లా… నీ కడుపున కొడుకై పుడతానే…
కుతురుగా పుట్టు… నీ పేరే పెడతాలే…ఏ ఏ
గొడవెందుకు బావతో వెళతావా… పద బావా పాల కోవా…
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
మంచును తడిసిన పువ్వా… నీ నవ్వులు ఎవ్వరివమ్మా…
నీ రాజు ఎవ్వరంటా… ఆ ఆ ఆ… ఈ రోజే చెప్పమంటా ఆ ఆ ఆ…
చిటపట చినుకులు రాలి… అవి చివరకు ఎటు చేరాలి…
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి… ఊఉ…
నిండుగ నదులే ఉరికే… అవి చేరును ఏ ఈ దరికి…
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి…
అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి…
బ్రతుకంతా ఒకటై ఇలా జత కావాలి… ఈ ఈ
మన బొమ్మల పెళ్ళి… నువ్వే తాళిని మెళ్ళో కడతావా..?
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా..?
ఓ బావా ఒట్టే పెడుతున్నా… ఆ ఆ… నే కుడా ఒట్టేస్తున్నా… ఆ ఆ ఆ
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
మంచును తడిసిన పువ్వా… ఈ నవ్వులు ఎవ్వరివమ్మా…
నా రాజు నువ్వేనంటా…ఆ ఆ ఆ… ఈ రోజే తెలిసిందంట… ఆ ఆ ఆ…
నా రాజు నువ్వేనంటా…ఆ ఆ ఆ…
ఈ రోజే తెలిసిందంట… ఆ ఆ ఆ…ఓ ఓ… ఏ ఏ…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.