Menu Close

Rise of Shyam Telugu Lyrics – శ్యామ్ సింగ రాయ్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

పుట్టిందా ఓ అక్షరమే
కాగితపు కడుపు చీల్చే
అన్యాయం తలే తెంచే
అరె కరవాలంలా పదునాకలమేరా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… టెన్ టు ఫైవ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ ||2||

పటాసుల్నే లిఖిస్తాడు
నిజం కోసం శ్రమిస్తాడు
జనం కోసం తపిస్తాడు
అరె అజ్ఞానానికి పాతర వేస్తాడు

పడుతూ ఉన్నా ప్రతి పుటపైనా
తన నెత్తురు సిరలా పారేరా
మెడలే వంచే రాజులతోనే
కవి ప్రశ్నల యుద్ధంరా
సింధూరం రంగున్న జెండారా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… టెన్ టు ఫైవ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ ||2||

గర్జించే గొంతేరా
తెల్లోడైనా నల్లోడైనా తేడా లేదురా
స్వాతంత్య్రం నీ స్వప్నంరా
ఏ క్రోదాలు ఉద్వేగాలు నిన్నేం చేయురా

గుడిలో ఉన్నా గడిలో ఉన్నా
స్త్రీ శక్తికి ఇంతటి కష్టాలా
తలలే తెంపే ఆ కాళికకే
చెరబట్టుతూ సంకేతాలా
నీ వల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ ||2||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading