Menu Close

Em Pilladi Entha Maatannadi Song Lyrics in Telugu-Allari Priyudu-1993

ఏం పిల్లది ఎంత మాటన్నదీ… ఏం కుర్రది కూత బాగున్నదీ
హోయ్..! సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలిపై కెంపులు తన సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది

బాగున్నది కోడె ఈడన్నదీ… ఈడందుకే వీధి పాలైనదీ
కమ్మని కల కల్లేదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది
ఏం పిల్లది ఎంత మాటన్నదీ… బాగున్నది కోడె ఈడన్నదీ

పువ్వాకు పువ్వాకు పువ్వాకు… పువ్వ పువ్వ పువ్వ పువ్వ పువ్వాకు
లవ్వాకు లవ్వాకు లవ్వాకు… లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వాకు

శనివారం ఎంకన్న సామి పేరు జెప్పి
శనగ లడ్డు చేత పెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి
అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది
ఇనుకోని ఆరాటం ఇబ్బంది… ఇడమరిసే ఈలెట్ట ఉంటుంది
ఎదలోనే ఓ మంట పుడుతుంది… పెదవిస్తే అది కూడ ఇమ్మంటుంది
చిరు ముద్దుకి ఉండాలి చీకటి అంది
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీర ముద్దిస్తుంటే ఎంగిలన్నది
ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది

ముద్దాకు ముద్దాకు ముద్దాకు… ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దాకు
సిగ్గాకు సిగ్గాకు సిగ్గాకు… సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గాకు

సుకురారం మా లచ్చిమి… నీకు సాటి అంటూ
పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నడూ
సోమారం జాము రాతిరి… తెల్ల చీర తెచ్చి
మల్లెపూల కాపడలు పెట్టమన్నాడు
ఉత్సాహం ఆపేది కాదంట… ఉబలాటం కసిరేస్తే పొదంట
ఉయ్యాల జంపాల కథలోనే… ఊ కొట్టే ఉద్యోగం నాదంట
వరసుంటే వారంతో పని ఏముంది… ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది
మళ్ళీ కావలన్న మనసు ఉన్నది

వామ్మో..! ఏం పిల్లది ఎంత మాటన్నదీ… బాగున్నది కొడె ఈడన్నదీ
సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది… కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
ఏం పిల్లది ఎంత మాటన్నదీ… బాగున్నది కోడె ఈడన్నదీ

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading