Menu Close

నువ్వు..నేను..ప్రజ్ఞ కలిసి ఇప్పటికి అయిదు సంవత్సరాలవుతోంది – Real Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu

నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి

స్నేహితురాలికి ఒక లేఖప్రియమైన లాస్య కు….టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన తర్వాత…మొబైల్ లో మెసేజ్ లా కాకుండా…ఉత్తరం లా రాస్తున్నాను…ఇది మెయిల్ కావచ్చు… కానీ ఇదంతా టైప్ చేస్తుంటే ఉత్తరం రాస్తున్నట్టే ఉంది. ఎందుకనో… రాయలనిపించింది…. కారణం మన ఫ్రెండ్…ప్రజ్ఞ…. నువ్వు..నేను..ప్రజ్ఞ కలిసి ఇప్పటికి అయిదు సంవత్సరాలవుతోంది…

Telugu Stories art

నీతో మాట్లాడడానికి నువ్ కాంటాక్ట్ లో లేవు… నీ పెళ్లి తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిపోయావు.. మీ నాన్నగారి ట్రాన్స్ఫర్ తో మీ ఫామిలీ షిఫ్ట్ అయిపోయారు.. అలా నీ కాంటాక్ట్ మాకు మిస్ అయింది…. నా పెళ్లి జరిగిన ఆరు నెలలకు ..ప్రజ్ఞ ను కూడా మా ఊరి లో నే ఉన్న …మాకు తెలిసిన కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు…

చెప్పడం మరచిపోయా…మా ఆయన లోకల్ గా సిమెంట్..ఐరన్ హోల్ సెల్ షాప్ పెట్టారు..తన తండ్రి వ్యాపారమే..ఇప్పుడు మా ఆయన చేస్తున్నారు…నేను హౌస్ వైఫ్.. మాకు ఒక పాప…మామయ్య గారు ఈ మధ్యనే కాలం చేశారు..అత్తమ్మ మా తో నే వుంటారు..ఇక ప్రజ్ఞ విషయానికి వస్తే…ప్రజ్ఞ గురించి మనకు తెలిసిందే కదా…

మన ముగ్గురిలో అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అప్పట్లో….ఉన్నింటి బిడ్డ…స్థితిమంతులు…ఒక్కగానొక్క కూతురు…ఎంత గారాబం గా పెరిగింది… అవునే…అప్పట్లో…దాని మేనత్త కొడుకు మహి…ఎంత ఇష్టపడేవాడో..ఎంత కేరింగ్ గా చూసుకునేవాడు కదా..ప్రజ్ఞ ను…. చూస్తున్న మనకే దాని అదృష్టం మీద అసూయ పుట్టేంత గా….

చదువైపోయాక మహి పేరెంట్స్ ప్రజ్ఞ ను ఇంటి కోడలుగా చేసుకుంటాం అని ప్రజ్ఞ పేరెంట్స్ ను అడిగితే…మహి వాళ్ళు కొద్దిగా డబ్బున్న కుటుంబం కాదని ఆ సంబంధాన్ని ఒప్పుకోలేదంట….తర్వాత నేనున్న ఊరిలో నే ఇంకో డబ్బున్న వ్యాపార కుటుంబం లోని వ్యక్తికి ఇచ్చి ప్రజ్ఞ ను పెళ్లి చేశారు…అప్పట్నుంచి మరల మా స్నేహం కొనసాగింది…

అప్పుడప్పుడు తను మా ఇంటికి..నేను వాళ్ళింటికి వెళ్ళొస్తుండేదాన్ని…పేరు కే…డబ్బున్న కుటుంబం…అందులో ప్రేమ లు మాత్రం ఆ ఇంట్లో దొరకవు…వ్యాపార సూత్రాలు కుటుంబం లో పాటించే రకాలు వాళ్ళు…ప్రజ్ఞ భర్త అయితే చెప్పాల్సిన పని లేదు…అతనికి పెళ్లికి ముందే ఇంకో ప్రేమ వ్యవహారం ఉంది..ఇప్పటికి వారిద్దరూ రిలేషన్ లో వున్నారు..

wife and husband

అతనికి ప్రజ్ఞ పట్ల పెద్దగా ఇష్టం కానీ..ప్రేమ కానీ లేవు…బయటి ప్రపంచం తెలియని పిల్ల…పెళ్లయిన కొన్ని రోజుల కు భర్త వ్యవహారం తెలిసింది…నిలదీసింది.. ఇక అప్పట్నుంచి ఇంట్లో గొడవలు..వేధింపులు..సాధింపులు మొదలయ్యాయి…ప్రజ్ఞ చాలా సార్లు పుట్టింటికెళ్లింది..పంచాయితీ లు పెట్టించడం..బంధువులు సర్ది చెప్పి పంపించడం..తిరిగి కాపురం లో గొడవలు….అతను విపరీతంగా కొట్టేవాడు..

ఆ శారీరక హింస తట్టుకోలేక పోయింది..అసలే పుట్టింట్లో సున్నితంగా పెరిగిన పిల్ల…. దెబ్బ శరీరానికి అయిన…ఆ దెబ్బ తాలూకు మచ్చ మాత్రం..ఆడదాని మనసు పై..ఆత్మాభిమానం పై పడుతుందని మగవాళ్లకు ఎందుకు అర్థం కాదో….నాతో చాలాసార్లు మాట్లాడింది..బాధ పడేది…ఏదో సర్ది చెప్పుకునేవాళ్ళం…

అయిన ఈ మధ్య కాలం లో ఇలాంటివి ఎక్కువే వింటున్నాం..అందుకే పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దని చెప్పా…కానీ…సంవత్సరం క్రితం ఇలానే .గొడవ తో పుట్టింటికెళ్లిన ప్రజ్ఞ…ఆత్మహత్య చేసుకుని చనిపోయింది…చివరిగా రాసిన లెటర్ లో తన చావు కు కారణమైన అత్తింటివారి గురించి..భర్త వేధింపులు గురించి రాసిందట..

అది విన్న నాకు కాళ్ళ కింద భూమి కంపించిపోయింది..ఎంత బాధ..ఎంత వేదన నా మనసుకు..మాటల్లో చెప్పలేను…నేను కూడా అంత్యక్రియలకు వెళ్ళొచ్చాను…ఎంత బాధ పడ్డానో..ఎంతగా ఏడ్చానో చెప్పలేను…దాదాపుగా ఒక నెల రోజుల పాటు మాములు మనిషిని కాలేకపోయా..ఏ పని చేస్తున్న..మనం చదువుకునే రోజులు..చేసిన అల్లరి.. మన ముచ్చట్లు..ఎంతకీ తీరని కబుర్లు…ఎంతగా గుర్తొస్తున్నాయో తెలుసా…

అసలు తను ఎంత చక్కగా పాటలు పాడేది .ఆ గొంతు ఇప్పుడు మట్టిలో కలిసి పోయింది…వినగలమా? దాని గొంతుని…..ఎన్ని జోక్ లు వేసేది…అసలు ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అసలు..వాళ్ళ అమ్మ నాన్న ను చూస్తే చాలా బాధేస్తుందే… పాపం..ఆ కుటుంబం లో ప్రజ్ఞ చావుతో సంతోషమే మాయమైపోయింది…ఆత్మహత్య పరిష్కారం కాదు అని ఎంతమందికి అర్థం అవుతుంది??

సమస్యలు తాత్కాలికం జీవితం శాశ్వతం అయిన.. మన తల్లిదండ్రుల కష్టం తో మొదలయ్యే మన జీవితాన్ని..మన ఆనందాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టడం ఏంటి చెప్పు… ప్రతి ఆడపిల్ల భర్తను..కుటుంబాన్ని ప్రేమించాలి..బాధ్యతగా మసలుకోవాలి..ఒకవేళ సమస్యలు వస్తే సర్దుకుపోవాలి..లేదా..వీలైనంత పరిష్కరించుకోవాలి .అది కూడా కాదు.. పరిష్కారం లేని సమస్య అయితే..ఆ బంధాన్ని తెంచుకోవడం ఉత్తమం..

ఆత్మహత్య తో పోలిస్తే విడిపోవడం మంచిది కదా….కనీసం జీవితం మిగులుతుంది..అత్తింటి సమస్యల తో సతమత మయ్యే…ప్రతి ఆడపిల్ల కు ధైర్యాన్ని .తోడు ను ఇచ్చే (పుట్టిల్లు) కుటుంబం ఉండాలి…మానసిక ధైర్యాన్ని ఇచ్చేలా ఉండాలి…మెయిల్ లో నా అడ్రస్ ..ఫోన్ నంబర్ రాశాను….వీలు చూసి రిప్లై పంపు….వీలున్నప్పుడు కాల్ చెయ్… . .. ఇట్లుప్రేమతోనీ స్నేహితురాలు ..అపర్ణ.(అసలు…రచయిత గా నా ఉద్దేశం ఒకటే…ఆత్మహత్య పరిష్కారం కాదు..ఒకటే జీవితం..దేని కోసమో..ఎవరి కోసమో..మన జీవితాన్ని ముగించుకో కూడదు.)సర్వేజనా సుఖినోభవంతుస్వస్తి….కేరళ లో ఈ మధ్య నే ఆత్మహత్య చేసుకుని మరణించిన నవ వధువు…ఇంకా ఎందరో …ఇలాంటి కథల కు ప్రేరణ.

Telugu Stories art

కథ: స్నేహితురాలు కి లేఖ 2

హాయ్…అప్పు…అపర్ణా…లవ్ యూ నేఎలా ఉన్నావే…బాగున్నావా…. నీవు పంపిన మెయిల్..చదివాను…ఎంతో ఉత్సాహంగా చదవడం మొదలుపెట్టాను..కానీ..ఎంతో వేదన తో చదవడం ముగించాను…నీ కాంటాక్ట్ దొరికినందుకు సంతోష పడాలో..ప్రజ్ఞ.. అలా జీవితం ముగించు కున్నందుకు బాధ పడాలో అర్థం కావట్లేదు…దానికే మైనా పిచ్చి పట్టిందా..

అయినా అసలు అది ఎలా ఆత్మహత్య చేసుకుంటుంది…జీవితం అంటే ..కష్టాలు..నష్టాలు..సుఖాలు..సంతోషాలు అన్ని కలగలిసిన వే….కదా…తీపి బాగుంటుంది అని తింటూ పోతే..ఏదో ఒక సందర్భంలో తీపి కూడా వెగటుగా మారిపోతుంది.సుఖాలు కూడా తీపి లాంటివే…..కష్టాలు ఊరికే రావు..మనల్ని మార్చడానికి వస్తాయి…మన లోని నిద్రాణమై ఉన్న ధైర్యాన్ని..తట్టి లేపి..మనలో ఆత్మ స్థైర్యం పెంపొంద డానికి తోడ్పడతాయి..

కావాల్సిందల్లా మనలో ఓర్పు….నీకో విషయం గుర్తుందాకాలేజ్ రోజుల్లో…రాజేష్.గుర్తున్నాడా…..ప్రజ్ఞ వెంటపడి వేధించే వాడు..ఎప్పుడు చూడు ప్రేమ..ప్రేమ అంటూ తిరిగేవాడు…ప్రజ్ఞ ఎంత ధైర్యంగా ..తన తండ్రి కి చెప్పి…రాజేష్ కు బుద్ధి చెప్పింది…ప్రజ్ఞ తల్లి..రాజేష్ తల్లిని చేతులు పట్టుకు బతిమాలింది..తమ పిల్ల జోలికి రావద్దని..అల్లరి పెట్టవద్దని…ఎంత ప్రేమగా తమ కూతురికి వచ్చిన సమస్యను అప్పట్లో పరిష్కరించు కొన్నారు ప్రజ్ఞ తల్లిదండ్రులు…మరి…అల్లుడి దగ్గరికొచ్చే సరికి ఆ ధైర్యం..తెలివి ఏమయ్యాయి….

నాకు ఈ విషయం లో చాలా బాధ గా అనిపించింది…. నీ లెటర్ ను మూడు రోజుల కిందటే చదివాను…అప్పటి నుంచి నాకు కూడా ప్రజ్ఞ జ్ఞాపకాలే…దాని ప్రేమ..అల్లరి..మాటలు..పాటలు.. గుర్తొస్తుం టే…కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదే…ఏమైనా…దాని స్నేహం లో మనం గడిపిన క్షణాలు అద్భుతం..అపురూప మైనవి…దాని ఆత్మశాంతి కై ప్రార్థించడం మాత్రమే చేయగలం…మరచిపోయా …నా గురించి చెప్పలేదు గా…మా వారి పేరు శ్రీకర్…సాప్ట్ వేర్ జాబ్…నన్ను మెచ్చి చేసుకున్నారు..

మా అత్త మామలు డిఫెరెంట్…చాలా బాగా చూసుకుంటారు నన్ను..అన్ని విషయాల్లో నాకు సపోర్ట్…మా నాన్న ఎవర్నో నమ్మి…ఫైనాన్స్ వారికి షురిటీ సంతకం పెట్టాడు..ఫలితంగా..అతను డబ్బు సరిగ్గా కట్టక పోవడం…మా నాన్న ఆస్తులు జప్తు చేశారు…చాలా ఇబ్బందులు పడ్డాం ..అప్పట్లోనే…శ్రీకర్ తో నాకు పెళ్ళి జరిగింది….నిజానికి నాకు మా పుట్టింటి లాగే… మంచి ఆత్తగారిల్లు దొరికిందని చెప్పచ్చు…ఇంట్లో అందరూ నాతో చాలా ప్రేమగా ఉంటారు…మా అత్త మామలు కూడా…పెళ్లి తర్వాత కూడా శ్రీకర్ నాతో కొన్ని కోర్స్ లు ఇక్కడ…చేయించాడు…

Telugu Stories art

శ్రీకర్ కు భయ పడటం..అమాయకంగా ఉండడం నచ్చదు…అన్ని విషయాల్లో..సమాన అవకాశాల ను సద్వినియోగం చేసుకోవాలి అంటాడు…అప్పట్లో నేను చాలా భయంగా..బెరుకు గా ఉండేదాన్ని కదా…ఇప్పుడు నువ్వు నన్ను చూస్తే నమ్మలేవు తెలుసా.. అంత ధైర్యంగా ఉంటాను….మనుషుల్లో మంచి ..చెడు రెండు ఉంటాయి…ఏది ఎంతవరకు తీసుకోవాలి అనేది మన విజ్ఞత….నిజానికి ప్రజ్ఞ ను చూడు…తనని ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు..ఎంతో డబ్బు…తెలివి..చదువు ఉన్న వాళ్ళు…వివాహ బంధం కరెక్ట్ గా లేకపోతే ఎందుకు చనిపోవాలి…..

ఆడపిల్ల ను ఇలా ఎందుకు సమాజం విషయానికి వస్తె స్వేచ్చ…సమానహక్కులు..అంటూ..ఉద్యమిస్తూనే…ఇంకోపక్క…అత్తింట్లో ని.. అఘాయిత్యాల ను…… దౌర్జన్యాల ను సహించాలని..భరించాలని నేర్పిస్తారో… అర్థం కాదు…..చిన్నప్పుడు ఇంట్లో వున్న వాతావరణం …సమాజం లో ఉంటుందా…ఈ తల్లిదండ్రులు కూడా ఎందుకు ఆలోచించరు..తమ కూతుర్ని..పెళ్లికి ముందు..ఒకరోజు కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఉండనివ్వరు..అలాంటిది పెళ్లి చేసి ఇంకోరింటికి పంపి…శాశ్వతంగా బాధ్యత తీరి పోయిందని భావిస్తారు…

ఇది ఎంతవరకు కరెక్ట్…పుట్టింట్లో ఏమో..” నువ్వు..ఏం చేసినా..మీ అత్త గారింట్లో…నే…ఇక్కడ మాత్రం నీకు హక్కు లేదు..నువ్వు ఈ ఇంటికి పరాయిదానివి…అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు…అత్తింట్లో ఏమో…” వేరే ఇంటి నుంచి వచ్చింది .ఎక్కువ బాగా చూసుకుంటే ఎక్కడ..నెత్తి మీద కెక్కి కూర్చుని…మమ్మల్ని ఆడిస్తుంది..మా కొడుకుకి చాలా దగ్గరై..మమ్మల్ని ఎక్కడ దూరం చేస్తుందో….అంటూ ఆమెకు హద్దుల్ని నిర్ణయిస్తారు..ఇక ఇలాంటపుడు కొడుక్కు పెళ్లి ఎందుకు చేయడం…బాగుండాలి అనే కదా…అలాంటపుడు కొడుకు ను కోడలికి వదిలేయాలి..ఎందుకంటే వారిద్దరూ జంట..ప్రతి అత్తగారు..వాళ్ళు పెళ్లయిన కొత్త లో ఎలాంటి అత్తింటిని కోరుకుని వుంటారో…కొత్తగా తమ ఇంటికి వచ్చిన కోడలికి కూడా అలాంటి వాతావరణాన్ని కల్పించాలి…

ఏవైనా సమస్యలు వచ్చినపుడు…మన వైపు నుంచి కాకుండా..అవతలి వ్యక్తి స్థానం లో వుండి ఆలోచించాలి..అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగు తారు…ఆడపిల్ల కు.. “నేను పుట్టింటికి చెందకా..అత్తింటికి చెందకా…ఏమిటి ఈ పరిస్థితి..”.అనే అభద్రత భావం లో అమ్మాయి మనసు ఊగిస లాడాల్సిందే నా….పుట్టింట్లో ఒక దెబ్బ కూడా తగలకుండా సుకుమారంగా పెంచుతారు..కానీ.. టైం బాగాలేక పోతే…అదే అమ్మాయి..అత్తింట్లో..మొగుడి చేతిలో..చావు దెబ్బలు తింటూ ఉంటోంది…..ఇంత శారీరక హింస ఒక వైపు…తన జీవితం ఇలా అయిపోయి నందుకు మానసిక హింస ఒక వైపు…..అందుకే ఆడపిల్లల్ని…వ్యక్తిత్వ వికాసం తో పెంచాలేమో…చిన్నప్పటి నుండే..ఏ సమస్యని అయినా..ధైర్యంగా ఎదుర్కొనేలా పెంచాలి…

అప్పు…మొబైల్ లో మాట్లాడుకోవడం కాకుండా..అప్పుడప్పుడు ఇలా మెయిల్స్.. ..ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అపర్ణ….వీలున్నప్పుడు మెయిల్ పంపుతాను…..నువ్వు కూడా వీలుంటే రిప్లై పంపు….మీ ఇంట్లో అందరికీ అడిగానని చెప్పు…ఇట్లుప్రేమతో.. నీ స్నేహితురాలు…లాస్య….సమాప్తం

Like and Share
+1
1
+1
2
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading