Menu Close

Real Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Real Stories in Telugu

టాటా స్టీల్స్ చైర్మన్ వారాంతంలో నిర్వహించే ఉద్యోగుల సమావేశంలో ఉద్యోగుల సమస్యలు చర్చించేవారు. ఒకసారి ఒక కింది తరగతి ఉద్యోగి ఒక సీరియస్ సమస్యను చైర్మన్ గారి దృష్టికి తెచ్చాడు. పనివాళ్ళు వాడుకునే మరుగు దొడ్లు, మూత్రశాలలు కంపుకొడుతూ అసహ్యంగా ఉన్నాయని, పెద్ద ఉద్యోగస్తుల వాష్ రూమ్లు శుభ్రంగా తళతళా మెరిసి పోతున్నాయని ఫిర్యాదు చేసాడు.

పై అధికారిని, చైర్మన్ గారు అడిగారు, “ఈ సమస్య పరిష్కరించడానికి మీకెన్ని రోజులు పడుతుంది”, “ఒక నెలలో పరిష్కరిస్తాం” అని చెప్పాడు. “నేను ఒక రోజులో సరిచేస్తా, ఒక వడ్రంగిని పిలిపించండి” తర్వాత రోజు వడ్రంగి రాగానే, వాష్ రూమ్లకు ఉన్న సైన్ బోర్డులు మార్చమన్నాడు. అంతేకాదు, ఈ సైన్ బోర్డులు ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చమని ఆజ్ఞాపించారు” ఇప్పుడు పనివాళ్ళ మరుగు దొడ్లు అధికారులవయ్యాయి, అధికారులవి పనివాళ్ళవయ్యాయి” మూడో రోజుకంతా పనివాళ్ళు, ఉద్యోగుల మరుగు దొడ్లు, మూత్రశాలలు ఒకే స్థాయికి వచ్చాయి.

నాయకులు సమస్యలను శ్రద్ధగా, సహనంతో వింటారు. క్షణం వృధా కాకుండా పరిష్కరిస్తారు. అధికారం చెలాయించడం కాదు, నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలి. సమస్యను గుర్తించడానికి సూక్ష్మ పరిశీలన కావాలి. పరిష్కారాలు చూపించడానికి సృజనాత్మకత కావాలి.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading