ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అసుర రావణాసుర… అసుర అసుర రావణాసుర
విశ్వ విశ్వ నాయక… రాజ్య రాజ్య పాలక
వేల వేల కోట్ల… అగ్ని పర్వతాల కలయిక
శక్తి శక్తి సూచిక… యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు… ఒక్కటైన కదలిక
ఓ… ఏకవీర, సూర, క్రూర కుమారా
నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వరా
హో… రక్తధార చోర ఘోర అఘోర
కర్కశంగ రేగుతున్న కాలకింకర
రావణా జై జై జై… శత్రుశాసనా జై జై జై
రావణా జై జై జై… సింహాసనా జై జై జై
అసుర అసుర… అసుర అసుర రావణాసుర
అసుర అసుర… అసుర అసుర రావణాసుర
చిత్ర చిత్ర హింసక… మృత్యు మృత్యు ఘంటిక
మృత్యుకాల ఏకకాల… పలు రకాల ధ్వంశక
ఖడ్గ భూమి ధార్మిక… కదనరంగ కర్షక
రావణగర పట్టణాల… సకల జనాకర్షక
ఓ… అంధకార.. తార.. ధీర.. సుధీర
అందమైన రూపమున్న… అతి భయంకర
ఓ ఓఓ.. ధుర్వితార… భైర… స్వైర విహార
పాప లాగ నవ్వుతున్న ప్రళయ భీకర
రావణా జై జై జై… శత్రుశాసనా జై జై జై
రావణా జై జై జై… సింహాసనా జై జై జై
నవరసాల పోషక… నామరూప నాషక
వికృతాల విద్యలెన్నో… చదివిన వినాశక
చరమగీత గాయక… నరకలోక నర్తక
అక్రమాల లెక్కలోన… నిక్కిన అరాచక
ఓ… అహంకార… హర.. భార.. కిషోర
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వర
హో హో హో… తిరస్కార.. ధీర.. ఏర.. కుభీర
కణము కణము రణములైన కపాలేశ్వర
రావణా జై జై జై… శత్రు శాసనా జై జై జై
రావణా జై జై జై… సింహాసనా జై జై జై