Menu Close

Akasam Ammayaithe Lyrics In Telugu – Gabbar Singh – ఆకాశం అమ్మాయైతే లిరిక్స్

Akasam Ammayaithe Lyrics In Telugu – Gabbar Singh – ఆకాశం అమ్మాయైతే లిరిక్స్

ఏం చక్కని మందారం… ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం… ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం… ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం… ఇక తియ్యని ప్రేమకు తయ్యారం

ఓ… ఆకాశం అమ్మాయైతే… నీలా ఉంటుందే, నీలా ఉంటుందే
ఓఓ… ఆనందం అల్లరి చేస్తే… నాలా ఉంటుందే, నాలా ఉంటుందే
వానల్లె నువ్వు జారగా… నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా… అది వరదై పొంగి సాగరమౌతుందే
హోలా హోలా… హోలా హోలా
నీ కళ్ళల్లోనే… చిక్కానే పిల్లా
హోలా హోలా… హోలా హోలా
ఇక చాలా చాలా… జరిగే నీ వల్లా

ఏం చక్కని మందారం… ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం… ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం… ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం… ఇక తియ్యని ప్రేమకు తయ్యారం

అల్లేసి నను గిల్లేసి… తెగ నవ్వినావె సుగుణాల రాక్షసి, శత్రువంటి ప్రేయసి
పట్టేసి కనికట్టేసి దడ పెంచినావె… దయలేని ఊర్వశి, దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ… నీలో పలికేనే, నిద్దుర పుచ్చేనే
ఓఓ… లోకంలో అందాలన్నీ… నీలో చేరేనే నిద్దుర లేపేనే
హోలా హోలా… హోలా హోలా
నీ కళ్ళల్లోనే… చిక్కానే పిల్లా
హోలా హోలా… హోలా హోలా
ఇక చాలా చాలా… జరిగే నీ వల్లా

ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం… ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీ వల్లే ఇంతానందం… గుండెల్లో కదిలింది పూల రథం

వచ్చేసి బతికిచ్చేసి… మసి చేసినావె…
రుషిలాంటి నా రుచి… మార్చినావె అభిరుచి
సిగ్గేసి చలి మొగ్గేసి… ఉసి గొలిపినావె
సరిగమగ పదనిసి… చేర్చినావె ఓఓ గసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ… నీలో పొంగేనే ప్రాణం పోసేనే
ఓఓ…నరకంలో నానా హింసలు… నీలో సొగసేనే ప్రాణం పోసేనే
హోలా హోలా… హోలా హోలా
నీ కళ్ళల్లోనే… చిక్కానే పిల్లా
హోలా హోలా… హోలా హోలా
ఇక చాలా చాలా… జరిగే నీ వల్లా

ఏం చక్కని మందారం… ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం… ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం… ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం… ఇక తియ్యని ప్రేమకు తయ్యారం.. ..

Akasam Ammayaithe Lyrics In Telugu – Gabbar Singh – ఆకాశం అమ్మాయైతే లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading