Menu Close

రామాయణం‌ 108 ప్రశ్నలు మరియు వాటి జవాబులు

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.

 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
  వాల్మీకి.
 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
  నారదుడు.
 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
  తమసా నది.
 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
  24,000.
 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
  కుశలవులు.
 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
  సరయూ నది.
 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
  =కోసల రాజ్యం.
 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
  సుమంత్రుడు.
 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
  కౌసల్య, సుమిత్ర, కైకేయి.
 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
  పుత్రకామేష్ఠి.
 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
  కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
  జాంబవంతుడు.
 13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
  దేవేంద్రుడు.
 14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
  హనుమంతుడు.
 15. కౌసల్య కుమారుని పేరేమిటి?
  శ్రీరాముడు.
 16. భరతుని తల్లి పేరేమిటి?
  కైకేయి.
 17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
  లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.
 18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
  వసిష్ఠుడు.
 19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
  16 సంవత్సరములు.
 20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
  మారీచ, సుబాహులు.
 21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
  బల-అతిబల.
 22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
  సిద్ధాశ్రమం.
 23. తాటక భర్త పేరేమిటి?
  సుందుడు.
 24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
  అగస్త్యుడు.
 25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
  భగీరథుడు.
 26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
  జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.
 27. అహల్య భర్త ఎవరు?
  గౌతమ మహర్షి.
 28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
  శతానందుడు.
 29. సీత ఎవరికి జన్మించెను?
  నాగటి చాలున జనకునికి దొరికెను.
 30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
  దేవరాతుడు.
 31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
  విశ్వకర్మ.
 32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
  మాండవి, శృతకీర్తి.
 33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
  జనకుడు.
 34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
  కుశధ్వజుడు.
 35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
  వైష్ణవ ధనుస్సు.
 36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
  యుధాజిత్తు.
 37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
  మంధర.
 38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
  గిరివ్రజపురం, మేనమామ యింట.
 39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
  శృంగిబేరపురం.
 40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
  గారచెట్టు.
 41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
  భారద్వాజ ముని.
 42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
  మాల్యవతీ.
 43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
  తైలద్రోణములో.
 44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
  జాబాలి.
 45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
  నందిగ్రామము.
 46. అత్రిమహాముని భార్య ఎవరు?
  అనసూయ.
 47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
  విరాధుడు.
 48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
  అగస్త్యుడు.
 49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
  గోదావరి.
 50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
  శూర్ఫణఖ.
 51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
  జనస్థానము.
 52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
  మారీచుడు.
 53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
  బంగారులేడి.
 54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
  జటాయువు.
 55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
  దక్షిణపు దిక్కు.
 56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
  కబంధుని.
 57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
  మతంగ వనం, పంపానదీ.
 58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
  ఋష్యమూక పర్వతం.
 59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
  హనుమంతుడు.
 60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
  అగ్ని సాక్షిగా.
 61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
  కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.
 62. సుగ్రీవుని భార్య పేరు?
  రుమ.
 63. వాలి భార్యపేరు?
  తార.
 64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
  కిష్కింధ.
 65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
  మాయావి.
 66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
  దుందుభి.
 67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
  మతంగముని.
 68. వాలి కుమారుని పేరేమిటి?
  అంగదుడు.
 69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
  ఏడు.
 70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
  ప్రసవణగిరి.
 71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
  వినతుడు.
 72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
  అంగదుడు.
 73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
  మామగారు, తార తండ్రి.
 74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
  శతబలుడు.
 75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
  మాసం (ఒక నెల).
 76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
  దక్షిణ దిక్కు.
 77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
  తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.
 78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
  స్వయంప్రభ.
 79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
  సంపాతి.
 80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
  పుంజికస్థల.
 81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
  మహేంద్రపర్వతము.
 82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
  మైనాకుడు.
 83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
  సురస.
 84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
  సింహిక.
 85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
  నూరు యోజనములు.
 86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
  లంబ పర్వతం.
 87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
  అశోక వనం.
 88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
  పన్నెండు
 89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
  త్రిజట.
 90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
  రామ కథ.
 91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
  చూడామణి.
 92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
  ఎనభై వేలమంది.
 93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
  ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
 94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
  విభీషణుడు.
 95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
  మధువనం.
 96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
  మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.
 97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
  ఆలింగన సౌభాగ్యం.
 98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
  నలుడు
 99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
  నికుంభిల.
 100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
  అగస్త్యుడు.
 101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
  ఇంద్రుడు.
 102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
  మాతలి.
 103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
  కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
 104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
  హనుమంతుడు.
 105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
  శత్రుంజయం.
 106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
  స్వయంగా తన భవనమునే యిచ్చెను.
 107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
  బ్రహ్మ.
 108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
  తన మెడలోని ముత్యాలహారం.
Like and Share
+1
2
+1
1
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker

Refresh Page
x

Subscribe for latest updates

Loading

Rashmika Mandanna Images Sai Pallavi Photos Samantha Cute Photos Pooja Hegde Images Anupama Parameswaran Cute Photos