ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.
- శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
వాల్మీకి. - వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
నారదుడు. - రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
తమసా నది. - శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
24,000. - శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
కుశలవులు. - అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
సరయూ నది. - అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం. - దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
సుమంత్రుడు. - దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
కౌసల్య, సుమిత్ర, కైకేయి. - సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
పుత్రకామేష్ఠి. - యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. - బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
జాంబవంతుడు. - వాలి ఎవరి అంశతో జన్మించెను?
దేవేంద్రుడు. - వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
హనుమంతుడు. - కౌసల్య కుమారుని పేరేమిటి?
శ్రీరాముడు. - భరతుని తల్లి పేరేమిటి?
కైకేయి. - రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర. - రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
వసిష్ఠుడు. - విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
16 సంవత్సరములు. - విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
మారీచ, సుబాహులు. - రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
బల-అతిబల. - విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
సిద్ధాశ్రమం. - తాటక భర్త పేరేమిటి?
సుందుడు. - తాటకను శపించిన మహర్షి ఎవరు?
అగస్త్యుడు. - గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
భగీరథుడు. - గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే. - అహల్య భర్త ఎవరు?
గౌతమ మహర్షి. - జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
శతానందుడు. - సీత ఎవరికి జన్మించెను?
నాగటి చాలున జనకునికి దొరికెను. - శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
దేవరాతుడు. - శివధనుస్సును తయారు చేసినదెవరు?
విశ్వకర్మ. - భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
మాండవి, శృతకీర్తి. - లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
జనకుడు. - జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
కుశధ్వజుడు. - పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
వైష్ణవ ధనుస్సు. - భరతుని మేనమామ పేరు ఏమిటి?
యుధాజిత్తు. - దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
మంధర. - కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
గిరివ్రజపురం, మేనమామ యింట. - రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
శృంగిబేరపురం. - సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
గారచెట్టు. - శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
భారద్వాజ ముని. - పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
మాల్యవతీ. - దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
తైలద్రోణములో. - శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
జాబాలి. - భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
నందిగ్రామము. - అత్రిమహాముని భార్య ఎవరు?
అనసూయ. - దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
విరాధుడు. - పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
అగస్త్యుడు. - పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
గోదావరి. - లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
శూర్ఫణఖ. - ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
జనస్థానము. - సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
మారీచుడు. - సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
బంగారులేడి. - సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
జటాయువు. - సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
దక్షిణపు దిక్కు. - సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
కబంధుని. - సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
మతంగ వనం, పంపానదీ. - సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
ఋష్యమూక పర్వతం. - రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
హనుమంతుడు. - రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
అగ్ని సాక్షిగా. - రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు. - సుగ్రీవుని భార్య పేరు?
రుమ. - వాలి భార్యపేరు?
తార. - వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
కిష్కింధ. - వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
మాయావి. - హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
దుందుభి. - వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
మతంగముని. - వాలి కుమారుని పేరేమిటి?
అంగదుడు. - రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
ఏడు. - సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
ప్రసవణగిరి. - సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
వినతుడు. - సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
అంగదుడు. - సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
మామగారు, తార తండ్రి. - సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
శతబలుడు. - సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
మాసం (ఒక నెల). - హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
దక్షిణ దిక్కు. - సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము. - హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
స్వయంప్రభ. - సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
సంపాతి. - హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
పుంజికస్థల. - హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
మహేంద్రపర్వతము. - హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
మైనాకుడు. - హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
సురస. - హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
సింహిక. - హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
నూరు యోజనములు. - లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
లంబ పర్వతం. - హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
అశోక వనం. - రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
పన్నెండు - రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
త్రిజట. - హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
రామ కథ. - రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
చూడామణి. - హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
ఎనభై వేలమంది. - హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం. - దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
విభీషణుడు. - తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
మధువనం. - వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు. - సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
ఆలింగన సౌభాగ్యం. - సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
నలుడు - ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
నికుంభిల. - రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
అగస్త్యుడు. - రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
ఇంద్రుడు. - రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
మాతలి. - రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం! - గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
హనుమంతుడు. - అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
శత్రుంజయం. - శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
స్వయంగా తన భవనమునే యిచ్చెను. - పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
బ్రహ్మ. - శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
తన మెడలోని ముత్యాలహారం.
Like and Share
+1
3
+1
2
+1