Menu Close

Rama Rama Lyrics in Telugu – Srimanthudu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Rama Rama Lyrics in Telugu – Srimanthudu

సూర్యవంశ తేజమున్న
సుందరాంగుడు పున్నమీసెంద్రుడు
మారాజైనా మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు
జనమమెత్తిన మహానుభావుడు… వాడే శ్రీరాముడు

రాములోడు వచ్చినాడురో దన్ తస్సదియ్య
శివధనస్సు ఎత్తినాడురో
నారి పట్టి లాగినాడురో దన్ తస్సదియ్య
నింగికెక్కు పెట్టినాడురో
ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు
భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని పేలినట్టు
విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ

రాజ్యమంటె లెక్కలేదురో దన్ తస్సదియ్య
అడవిబాట పట్టినాడురో
పువ్వులాంటి సక్కనోడురో దన్ తస్సదియ్య
సౌక్యమంత పక్కనెట్టెరో
బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి
పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి
తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ

రామసక్కనోడు మా రామసెంద్రుడంట
ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట
అందగాళ్లకే గొప్ప అందగాడట
నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా

జీవుడల్లే పుట్టినాడురో దన్ తస్సదియ్య
దేవుడల్లె ఎదిగినాడురో
నేలబారు నడిచినాడురో దన్ తస్సదియ్య
పూల పూజలందినాడురో
పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు
చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ

Rama Rama Lyrics in Telugu – Srimanthudu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading