Menu Close

Ram Gopal Varma Telugu Quotes Part 3

rgv

RGV Telugu Quotes, Ram Gopal Varma Telugu Quotes

RGV Telugu Quotes, Ram Gopal Varma Telugu Quotes

స్లో అండ్ స్టడీ అంటూ జీవితం మొత్తాన్ని వృధా చేసుకోవడం కంటే స్పీడు పెంచి దెబ్బ తగిలించుకోవడం మంచిది.

ఈ భూగ్రహానికి పట్టిన అతిపెద్ద వైరస్ మనుషులే.

మీరెప్పుడైతే మీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటారో…మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది.

నీలో ఉన్నశక్తి తెలియనంత వరకు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తరువాత నువ్వు అందరికి కొండలా కనిపిస్తావు.

ఇండియాలో ఉన్న అమెరికన్ల కన్నా అమెరికాలో ఉండే ఇండియన్సే ఎక్కువ. దీని బట్టి అర్థమవుతున్నదేమిటంటే అమెరికన్స్ ఇండియాని ప్రేమిస్తున్న దానికంటే ఇండియాన్స్ అమెరికాని ఎక్కువ ప్రేమిస్తున్నారని.

ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది కానీ అది ఉపయోగించుకునే ధైర్యమే చాలామందికి లేదు…!

మత విశ్వాసం మీకు జవాబులివ్వదు, ప్రశ్నలడగకుండా నోరు మూయిస్తుందంతే.

నేను ప్రతి ఉదయం లేచి ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నానా అని అనుకుంటూ ఉంటాను. అలాగే ప్రతిరాత్రి ఈ ప్రపంచం నన్ను ఎందుకు ఉండనిస్తుందా అని అనుకుంటూ ఉంటాను.

మీరు చేసేది మీకే నచ్చనపుడు మీకు బోర్ కొట్టి, మీకు ఇంట్రస్ట్ లేకుండా చేసేది ఏ పని ఉందో దానినే హార్డ్ వర్క్ అంటారు.

చీమలకి నరేంద్ర మోడీ ఎంత unimportant టేంటో, మనకి దేవుడు కూడా అంతే unimportant.

నేను చెప్పేది నిజం కాదు, మీరు నమ్మితే అది నిజం.

పవర్ లో ఉన్నవాళ్లు ఎప్పుడూ లంచగొండులే అవుతారు. పవర్ లో లేనివాళ్ళు వారిని చూసి అసూయ పడుతూ ఉంటారు.

పిల్లల్ని కనొచ్చు కానీ వారి మైండ్ ని కనలేము. కావున వారు మనం చెప్పినట్లు పెరుగుతారు అని అనుకోవడం తల్లిదండ్రుల మూర్ఖత్వం.

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading