Menu Close

Ram Gopal Varma Telugu Quotes Part 1

rgv

RGV Telugu Quotes, Ram Gopal Varma Telugu Quotes

గుంపులో నుండి వేరుగా నిలబడలేని ధైర్యం లేకపోతె ఎప్పటికి గుంపులో ఒకడిగానే మిగులుతాం.

చావు ఏ క్షణంలోనైనా రావొచ్చు అని తెలుసుకున్నవాడే ప్రతినిమిషం ఆనందంగా బతకగలడు.

మన లైఫ్ యే UNSECURE అని తెలిసినపుడు మనం ఏదైనా చేయడానికి ఎందుకు భయపడాలి.

చాలామంది పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటారంటే 365 రోజుల్లో కనీసం ఆ ఒక్క రోజన్నా కనీసం కొంతమంది ముందైనా ఫేమస్ గా ఫీలవడం కోసం.

నేను నాస్తికుడ్ని, ఎందుకంటే దైవాన్ని అర్థము చేసుకున్నాను.

నీకు ధనవంతులు ఇష్టమా ? పేదవారంటే ఇష్టమా ? అని అడిగితే నేను “నాకు ధనవంతులు అంటేనే ఇష్టమని నిర్మొహమాటంగా చెబుతా..ఎందుకంటే డబ్బు సంపాదించడంలో పేదవారికన్నా సంపన్నులకె ఎక్కువ మేధస్సు ఉంటుంది కాబట్టి.

అన్నిటినీ దేవుడు సృష్టించుకుంటే దెయ్యాన్ని ఎందుకు సృష్టించినట్టు ? దేవుడు సృష్టించకపోయుంటే మరి ఎవరు సృష్టించినట్టు ?

నాకు స్నేహితులకంటే శత్రువులే ఇష్టం, ఎందుకంటే శత్రువులు మనల్ని ఎప్పుడూ అలెర్ట్ గా ఉంచుతారు. స్నేహితులు ఏమరుపాటు పెంచుతారు.

మనకు జీవితంలో సమస్యలు లేకపోతె బోర్ కొట్టి చచ్చిపోవడం ఖాయం.

ఒక మనిషికి సాయం చేయడంలో ఇబ్బంది ఏంటంటే, అతనికి మళ్ళీ సాయం కావాల్సినపుడు మనమే గుర్తొస్తాం.

వాళ్లిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు, కానీ తరువాత సంతోషంగా బతకలేకపోయారు కారణం పెళ్లి చేసుకున్నారు.

నేను పవిత్రున్ని, నేను మంచోడిని, నేను దైవాంశ సంభూతుడిని, ప్రజల సేవకొరకే జన్మించెను అని చెప్పుకునే హక్కు నీకెంతుందో…నేను నీచుణ్ని, ఒక మూర్ఖుణ్ణి, యథాగతుడిని, విచేయుడిని, దుష్టస్వభావం కలవాడిని అని చెప్పుకునే వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఉంది.

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading