ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
జుట్టే దొరకపట్టు… పట్టా దులిపి కొట్టు
చెట్టు మీది దయ్యాలన్నీ… కాలి కూలి పోవాలా
చిమ్మా చీకటి చుట్టు… చిరుత పులిని పట్టు
ఉరికొచ్చే గుర్రమెక్కి… ఊరు ఊరు కాయాలా
ఎయ్ రా, ఎయ్ రా… వేటకత్తి పట్టి వీరభద్ర సామి
వెంటపడి నరక నరక వచ్చే
రా సామి… మా సామి
నోటి వెంట వింటే పొలి పొలికేక
మన్ను మిన్ను వెన్ను వణికి సచ్చే
రా సామి… మా సామి
దడదడ పిడుగుల అడుగులివే
చెడు కోతకు మొదలు ఇదే
తడబడే ధర్మం గెలుపు ఇదే
తొండాటకు బదులు ఇదే
మీసం కొసలు మిర్రా మిర్రా
కోసును తలలు సర్రా సర్రా
చూసిన చాలు కొర్రా కొర్రా
మసియే రాలు జర్రా జర్రా
వేటకత్తి పట్టి వీరభద్ర సామి
వెంటపడి నరక నరక వచ్చే
రా సామి… మా సామి
నోటి వెంట వింటే పొలి పొలికేక
మన్ను మిన్ను వెన్ను జల్లంటు వణికే
ఓహో హో ఓహో హో శరభ శరభ
తొడ నువు కొడితే… మెడ తెగి పడితే
నెత్తురంతా కుంకుమల్లే… చుట్టు చల్లి చల్లిపో
తెగ కలబడుతు… సెగ నువు పెడుతు
కుతుకల్ని కత్తిరించి… మంటలల్లో ఏసిపో
హరహరోం హరహరోం
హరహరోం హరహరోం
చుక్కలన్ని ఊడిపడ
దిక్కులన్ని గడగడ
ఉడికే గాలికి ఊపిరి ఆగా
రారా రారా రారా
మా పొలిమెర కావలుండే వీర
గబ్బిలాల గుంపులెక్క
దబ్బునొచ్చే పాపమింకా
ఒకటే దెబ్బకు విరిచేయ్ రెక్క
రారా రారా రారా
అందినమేరా అంతు చూడు ధీరా
కంట నిప్పు దుంకుతుండగా
ఎదుట ఉండలేరు
తప్పుకొని దారి ఇవ్వరా బూడిదైతారు
మీసం కొసలు మిర్రా మిర్రా
కోసును తలలు సర్రా సర్రా
చూసిన చాలు కొర్రా కొర్రా
మసియే రాలు జర్రా జర్రా
వేటకత్తి పట్టి వీరభద్ర సామి
వెంటపడి నరక నరక వచ్చే
రా సామి… మా సామి
నోటి వెంట వింటే పొలి పొలికేక
మన్ను మిన్ను వెన్ను వణికి సచ్చే
రా సామి… మా సామి
జడలను కొరడగా ఝుళిపించే
శివతాండవమీ కథలే
పెలపెల ఉరుములు కురిపించే
ఫెను ప్రళయం ఇక రగిలే
కంచు గంట మోగగా… గణాగణా
ఉచ్చు ఉరి విసిరెను… ధనాధనా
జముకుల మోతలు… భళాభళా
విష నాగు దండలు… విలావిలా
మీసం కొసలు మిర్రా మిర్రా
కోసును తలలు సర్రా సర్రా
చూసిన చాలు కొర్రా కొర్రా
మసియే మిగులు రారా వీరా, రా సామి