Menu Close

Kanapadani Female Version Lyrics In Telugu – Manchi Rojulochaie

నా చిన్ని పాదం… నీ గుండెపైన
ఆటాడుతుంటే… నువ్ మోసావు నాన్న
నీలోని ప్రాణం… నాలోన దాచి
నిన్నే నాలో చూసావు… ఓ నాన్న

నీ వల్లే ప్రేమంటే తెలిసింది… ఓ నాన్న
నీ వెంటే సంతోషం… కలిసిందిలే నాన్న
నీ చేతుల్లో ఉంటె… భయమేది ఓ నాన్న
ఒంటరిగా నేనున్నా… నా దైర్యం నువ్వేగా

నా నీడలా నా వెనుకే ఉంటునే
నడిపావులే నా ముందు దారుల్నే
నా నవ్వులే నీ లోకమంటూనే
నా చుట్టూ బంధాలే అల్లావు ఓ నాన్న

ఆరారో ఆరారిరాయే ఆరారో
ఆరారో ఆరారిరాయే ఆరారో
ఆరారిరాయో అరరాహి అరరాహి
అరరాహి రాయే
అరరాహి అరరాహి అరరాహి రాయే

కనిపించే దైవం నువ్వైనావు
కనిపించి ప్రతిరోజు పూజించినావు
నా కళ్ళ ముందు… నువ్వుంటే చాలు
నిన్నే చూస్తూ… బతికేస్తా ఓ నాన్న

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading