Menu Close

Priyathama Priyathama Lyrics In Telugu – Majili – ప్రియతమా ప్రియతమా లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Priyathama Priyathama Lyrics In Telugu – Majili – ప్రియతమా ప్రియతమా లిరిక్స్

ప్రియతమా ప్రియతమా… పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో తెలిసినది… వలపులో మధురిమా
చెలి చూపు తాకినా… ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా… దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా… ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా… చక్కనైన చుక్కరా
నిన్నుకోరు కుందిరా సుందరా

ప్రియతమా ప్రియతమా… పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో తెలిసినది… వలపులో మధురిమా

నీ ప్రేమలో ఆరాధనై… నీ నిండుగా మునిగాకా
నీ కోసమే రాశానుగా… నా కళ్లతో ప్రియలేఖ
చేరునో చేరదో తెలియదు ఆ కానుక
ఆశనే వీడకా వెనుక పడెను… మనసు పడిన మనసే

ఇష్టమైన సఖుడా… ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా

ఉన్నానిలా ఉంటానిలా… నీ నీడగా కడదాకా
కన్నీటిలో కార్తీకపు… దీపాన్నిరా నువులేక
దూరమే భారమై… కదలదు నా జీవితం
నీవు నా చేరువై నిలిచి… మసలు మధుర క్షణములెపుడో

ప్రియతమా ప్రియతమా… పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో తెలిసినది… వలపులో మధురిమా
చెలి చూపు తాకినా… ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా… దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా… ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా… చక్కనైన చుక్కరా
నిన్ను కోరుకుందిరా సుందరా.. ..

Priyathama Priyathama Lyrics In Telugu – Majili – ప్రియతమా ప్రియతమా లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading