ఓడిపోవడం అంటే… ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే… అవకాశం పొందడమే… ఆఆ ఆ
అడుగు అడుగు వెయ్యనిదే… అంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే… పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే… మహాసంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే… కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా… ఆఆ ఆ
మధ్యలో వదలొద్దురా నీ సాధనా…
ప్రయత్నమే మొదటి విజయం… ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం… ప్రయత్నమే మన ఆయుధం
ఓడిపోవడం అంటే… ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే… అవకాశం పొందడమే
వెళ్లే దారుల్లోన… రాళ్ళే అడ్డొస్తున్నా
అడ్డును కాస్త మెట్టుగ మలిచి… ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో… రక్తం చిందేస్తున్నా
అది ఎర్రసిరాగా మీ చరితను… రాస్తుందనుకోవాలి
అడుగంటు వేసాకా… ఆగకుండా సాగాలిర నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం… ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం… ప్రయత్నమే మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
ఇంత గొప్పగా పోరాడే… అవకాశం పొందడమే
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.