Menu Close

Okkadai Ravadam Song Lyrics In Telugu – Aa Naluguru Cinema

ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం… నడుమ ఈ నాటకం, విధి లీలా
వెంట ఏ బంధమూ రక్తసంబంధము… తోడుగా రాదుగా తుదివేళా…
మరణమనేది ఖాయమనీ… మిగిలెను కీర్తి ఖాయమనీ
నీ బరువూ… నీ పరువూ మోసేదీ ఈ ఈ ఈ…..

ఆ నలుగురూ ఆ నలుగురూ… ఆ నలుగురూ ఆ నలుగురూ

రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ… భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము… హద్దులే చెరిపెలే మరుభూమి
మూటలలోని మూలధనం… చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా కడకంటా నడిచేదీ…

ఆ నలుగురూ ఆ నలుగురూ… ఆ నలుగురూ ఆ నలుగురూ

నలుగురూ మెచ్చినా… నలుగురూ తిట్టినా
విలువలే శిలువగా మోశావు…
అందరూ సుఖపడే… సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావు…
నలుగురు నేడు పదుగురిగా… పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ……

ఆ నలుగురూ ఆ నలుగురూ… ఆ నలుగురూ ఆ నలుగురూ

పోయిరా నేస్తమా… పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావూ
ఆత్మయే నిత్యమూ… జీవితం సత్యమూ
చేతలే నిలుచురా చిరకాలం…
బతికిననాడు బాసటగా… పోయిననాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ…….

ఆ నలుగురూ ఆ నలుగురూ… ఆ నలుగురూ ఆ నలుగురూ

Like and Share
+1
0
+1
0
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images