ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Oka Devatha Song Lyrics In Telugu – Ninne Premistha
ఒక దేవత వెలసిందీ నీ కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే
ఒక దేవత వెలసిందీ… నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ… మధుమాసమే
సంధ్యకాంతుల్లోన శ్రావనిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తాననీ..!!
ఒక దేవత వెలసిందీ నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే
లాలాలాల లాలాలాల లాలాలాల
లాలాలాల లాలాలాల లాలాలాల
విరిసె వెన్నెల్లోన… మెరిసే కన్నుల్లోన
నీ నీడే చూసానమ్మా
ఎనిమిది దిక్కుల్లోన… నింగిని చుక్కల్లోన
నీ జాడే వెతికానమ్మ
నీ నవ్వే నా మదిలో అమృత వర్షం
ఒదిగింది నీలోనె… అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుందమ్మ నా మనసే… నిన్నే ప్రేమిస్తాననీ
ఒక దేవత వెలసిందీ… నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే
ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆ ఆఆఆ
రోజా మొక్కలు నాటి… ప్రాణం నీరుగ పోసి
పూయించ నీ జడ కోసం
రోజు ఉపవాసంగ… హృదయం నైవేధ్యంగా
పూజించ నీ జత కోసం
నీరెండకు నీవెంటే నీడై వచ్చీ
మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించీ
ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
ఇన్నాల్లూ అనుకోలేదే… నిన్నే ప్రేమిస్తాననీ
ఒక దేవత వెలసిందీ… నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ… మధుమాసమే
సంధ్యకాంతుల్లోన శ్రావనిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తాననీ..!!
ఒక దేవత వెలసిందీ నా కోసమే
ఈ ముంగిట నిలిచిందీ మధుమాసమే