Menu Close

Prema Endukani Nenante Song Lyrics In Telugu – Ninne Premistha

Prema Endukani Nenante Song Lyrics In Telugu – Ninne Premistha

ప్రేమ ఎందుకనీ నేనంటే… అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ
ఇన్నాల్లకు దొరికిందీ… ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుందీ… తియ్యని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహుర్తం పరుగున వస్తోంది

ప్రేమ ఎందుకనీ నేనంటే… అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ
తరరరరరా తరరరరా తర తరరరరరా తరరరరా

పాటల వినిపించే… ఆమె ప్రతి పలుకు, ఆఆ ఆ
హంసలా కదిలొచ్చే… అందాల ఆ కులుకూ
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు, ఆఆ ఆ
చీకటే చెరిగేలా… ఆ కంటి చూపూ
వేకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లె… నా చెలి మంధారం
ఎంత చేరువై ఉంటే అంత సంబరం

ప్రేమ ఎందుకనీ నేనంటే… అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ

ఏటిలో తరగల్లే ఆగనంటుంది, ఆఆ ఆ
ఎదురుగా నేనుంటే మూగబోతుందీ
కంటికి కునుకంటూ రానుపొమ్మంది, ఆఆ ఆ
మనసుతో ఆ చూపే ఆడుకుంటోందీ
ఏ మాసంలో వస్తుందో… జత కలిపే శుభసమయం
అందాక మరి ఆగాలంటే… వింటుందా హృదయం
వేచి ఉన్న ప్రతి నిమిషం వింత అనుభవం

ప్రేమ ఎందుకనీ నేనంటే… అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ
ఇన్నాల్లకు దొరికిందీ… ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుందీ… తియ్యని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహుర్తం పరుగున వస్తోంది

ప్రేమ ఎందుకనీ నేనంటే… అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images