Menu Close

Nuvve Nuvve Antu Naa Pranam Song Lyrics In Telugu – Kalisundham Raa

Nuvve Nuvve Antu Naa Pranam Song Lyrics In Telugu – Kalisundham Raa

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచె ఈ గానం
ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంత మల్లెల జలపాతం
నువ్వే నువ్వే అంటూ… నా ప్రాణం
పదేపదే పిలిచె… ఈ గానం

తరుముతు వచ్చే తియ్యని భావం… ప్రేమో ఏమో ఎలా చెప్పడం
తహతహ పెంచే తుంటరి దాహం… తప్పో ఒప్పో ఏం చెయ్యడం
ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా
ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా
అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం… పదేపదే పిలిచె ఈ గానం

Winter Needs - Hoodies - Buy Now

వివరివరంటూ ఎగిసిన ప్రాయం… నిన్నే చూసి తలొంచే క్షణం
నిగనిగమంటూ నీ నయగారం… హారం వేసి వరించే క్షణం
స్నేహాల సంకెళ్లే అల్లేసే కౌగిల్లో
పారాణి పాదాలె పారాడే గుండెల్లో
నడకే మరిచీ శిలయ్యింది కాలం

నువ్వే నువ్వే అంటూ… నా ప్రాణం
పదేపదే పిలిచె… ఈ గానం
ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచె ఈ గానం

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading