అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Ninnu Chudaka Lyrics in Telugu – Vasantham
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూసిన కంటికి ఎప్పటికి
నిదురన్నది రాదు మరి
మదిలో మరుమల్లెలు వాన కురిసే వేళ
పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా
ఓ పాలరాతి బొమ్మ నాలోని ఊపిరమ్మ
ఓ కొండపల్లిబొమ్మ నీ రాక కొత్త జన్మ
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
రంగు రంగు పూవుల్లో లేనేలేదు ఈ గంధం
నిన్ను తాకి పొందిందా చల్లగాలి సాయంత్రం
వేల వేల భాషల్లో లేనే లేదు ఇంతందం
తేలికైన నీ మాటే సుస్వరాల సంగీతం
ఓ నీలోని ఈ మౌనం కవితే అనుకోన
నవ కవితే అనుకోన
నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా
నీవేగా ఓ మైనా
సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా
నువుగాని దూరమైతే నా గుండె ఆగిపోదా
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
నీలి నీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు
కాటుకమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు
ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు
పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు
ఓ నాలోని ఈ భావం ప్రేమే అనుకోనా
తొలి ప్రేమే అనుకోనా
ఈ వేళ ఈ రాగం వరమే అనుకోన
కలవరమా నిజమేనా
ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక
నీలాల కంటిపాప రాసింది మౌన లేఖ
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూసిన కంటికి ఎప్పటికి
నిదురన్నది రాదు మరి
మదిలో మరుమల్లెలు వాన కురిసే వేళ
పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా
ఓ పాలరాతి బొమ్మ నాలోని ఊపిరమ్మ
ఓ కొండపల్లిబొమ్మ నీ రాక కొత్త జన్మ