ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓ… నీలాకాశంలో మెరిసే చంద్రుడివే…
రివ్వున నేలకు జారి… నాకై వచ్చావే
ఓహో హో… పొంగే నదిలా… నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన… అలజడి రేపావే
హే ఉక్కిరిబిక్కిరి అయ్యా… నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయే… ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే-రా… సుకుమార
ఈ మాయ నీవల్లేరా…
ఏదో అయ్యింది ఈ వేళా… ఇన్నాళ్ళూ లేదిలా
సరదాకైనా ఏ ఆడపిల్లైనా… నిను చూస్తుంటే ఉండగలనా
ఓ నిన్నే దాచేసి… లేవు పొమ్మంటా
నీకే నిన్నే ఇవ్వనంటా…
అరె… నిన్నే తాకిందని… గాలితొటి రోజూ గొడవేనంటా
నిన్ను నువ్వైనా… నాలాగా ప్రేమించ లేవంటా
ఓ… నీలాకాశంలో మెరిసే చంద్రుడివే…
రివ్వున నేలకు జారి… నాకై వచ్చావే
ఓహో హో… రహదారుల్లొ పూలు పూయిస్తా… నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా… నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా… నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే… నేనంటే నాకిష్టం
ఓ… నీలాకాశంలో మెరిసే చంద్రుడివే…
రివ్వున నేలకు జారి… నాకై వచ్చావే
ఓహో హో… పొంగే నదిలా… నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన… అలజడి రేపావే
హే ఉక్కిరిబిక్కిరి అయ్యా… నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయే… ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే-రా… సుకుమార
ఈ మాయ నీవల్లేరా…
ఏదో అయ్యింది ఈవేళా… ఇన్నాళ్ళూ లేదిలా